Sreeleela: నిర్మాతలకు ‘నో’ చెబుతున్న శ్రీలీల

ABN , First Publish Date - 2023-06-10T22:30:01+05:30 IST

తెలుగు చిత్రపరిశ్రమలోని వర్ధమాన హీరోయిన్లలో శ్రీలీల క్రేజ్ ప్రస్తుతం ఏ రేంజ్‌లో ఉందో తెలియంది కాదు. ఏ సినిమా పేరు విన్నా.. అందులో శ్రీలీల పేరు వినబడుతూనే ఉంది. ఇంకా ఆమెకు అవకాశాలు వరిస్తూనే ఉన్నాయి. అయితే కాల్షీట్స్ సమస్య కారణంగా.. కోలీవుడ్ నిర్మాతలకు, అలాగే టాలీవుడ్ నిర్మాతల నుంచి వస్తున్న ఆపర్లకు ఆమె నో చెబుతుందట.

Sreeleela: నిర్మాతలకు ‘నో’ చెబుతున్న శ్రీలీల
Heroine Sreeleela

తెలుగు చిత్రపరిశ్రమలోని వర్ధమాన హీరోయిన్లలో శ్రీలీల (Sreeleela) క్రేజ్ ప్రస్తుతం ఏ రేంజ్‌లో ఉందో తెలియంది కాదు. ఏ సినిమా పేరు విన్నా.. అందులో శ్రీలీల పేరు వినబడుతూనే ఉంది. తెలుగులో ఇప్పుడున్న హీరోయిన్లలో శ్రీలీల ఉన్నంత బిజీగా మరెవరూ లేరు. అయితే ఈ బిజీ కారణంగానే ఇప్పుడామెకు కోలీవుడ్ (Kollywood) నుంచి పిలుపు వస్తున్నా కూడా సింపుల్‌గా ‘నో’ (No) అని చెబుతుందట.

Sreeleela.jpg

ఇప్పట్లో తాను తమిళ చిత్రాల్లో నటించే అవకాశం లేదని ఆమె అంటోందట. కన్నడంలో ‘కిస్‌’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన శ్రీలీల.. తెలుగులో చేసిన మొదటి చిత్రం సరిగా విజయం సాధించకపోయినప్పటికీ.. ఇటీవల హీరో రవితేజ‌తో చేసిన ‘ధమాకా’ (Dhamaka) చిత్రంతో ఒక్కసారిగా ఆమె పాపులర్‌ అయ్యింది. ఆ మూవీలో అవకాశం రాగానే అందరి కళ్లు ఆమెపై పడ్డాయి. అంతే.. తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగానే ప్రాజెక్టులు ఉన్నాయి.

Sreeleela.jpg

బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌, మహేష్‌ బాబు, రామ్‌, నితిన్‌, వైష్ణవ్ తేజ్ వంటి హీరోల సినిమాలలో ఆమె నటిస్తోంది. అదే సమయంలో శ్రీలీలను తమ చిత్రాల్లో హీరోయిన్‌గా ఎంపిక చేసేందుకు పలువురు దర్శక నిర్మాతలు (Directors and Producers) ప్రయత్నించగా, ఇప్పట్లో కొత్త చిత్రాలను అంగీకరించే అవకాశం లేదని, కాల్షీట్స్ సమస్య కారణంగానే కమిట్‌ కాలేకపోతున్నట్టు శ్రీలీల (Heroine Sreeleela) వారికి నచ్చజెబుతున్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి:

************************************************

* Matti Katha: ‘మట్టి కథ’కు మూడు అంతర్జాతీయ అవార్డులు

*****************************************************************

*Samantha: క్లబ్‌లో బీర్ కొడుతూ.. ‘ఊ అంటావా మావ’ పాటకి నాటు నాటు స్టెప్స్.. వీడియో వైరల్


*************************************************************

*VarunLav: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ ఫొటోలు

***********************************

*Sharwa-Rakshita: శర్వానంద్, రక్షితల వెడ్డింగ్ రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి

**************************************************************

*Megha Akash: అవన్నీ వదంతులే.. మేఘా ఆకాష్ డేటింగ్ వార్తలపై తల్లి క్లారిటీ

*Mahi V Raghav: ‘సైతాన్’ వల్గర్ వెబ్ సిరీస్ కాదు.. అయినా ముందే హెచ్చరిక చేశాం

*Anasuya: అలసిపోయాను.. ఇక ఆపేస్తున్నాను

Updated Date - 2023-06-10T22:30:01+05:30 IST