Gopichand: ‘రామబాణం’ తర్వాత మరో పవర్‌ఫుల్ టైటిల్‌తో.. ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల

ABN , First Publish Date - 2023-06-12T16:56:08+05:30 IST

‘రామబాణం’ చిత్రం తర్వాత మ్యాచో హీరో గోపీచంద్ చేస్తున్న చిత్రానికి ‘భీమా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం 14గా.. నిర్మాత కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టైటిల్‌, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Gopichand: ‘రామబాణం’ తర్వాత మరో పవర్‌ఫుల్ టైటిల్‌తో.. ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల
Gopichand Bhimaa Movie First Look

ఇటీవల వచ్చిన ‘రామబాణం’ (Rama Banam) చిత్రంతో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయిన మ్యాచో హీరో గోపీచంద్ (Macho Hero Gopichand).. ఈసారి మరో పవర్‌ఫుల్ టైటిల్‌తో రెడీ అవుతున్నారు. గోపీచంద్ తన 31వ సినిమా కోసం కన్నడ దర్శకుడు ఏ హర్ష (A Harsha)తో చేతులు కలిపారు. యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ (Sri Sathya Sai Arts Production) నెం 14గా.. నిర్మాత కెకె రాధామోహన్ (KK Radhamohan) నిర్మిస్తున్నారు. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాతలు సినిమా టైటిల్‌ను అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా లాంచ్ చేశారు. ఈ చిత్రానికి ‘భీమా’ (Bhimaa) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ని లాక్ చేసారు.

ఇక విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో గోపీచంద్ (Gopichand) ఫెరోషియస్ పోలీసు అధికారిగా ఇంటెన్స్ రోల్‌లో కనిపిస్తున్నారు. ఇందులో గోపీచంద్ ఆవేశపూరితంగా చూస్తూ రగ్గడ్ లుక్‌ దర్శనమిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్‌లో ఒక ఎద్దును కూడా మనం చూడవచ్చు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్.. ఈ సినిమాలో గోపీచంద్ వైల్డ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నట్లుగా తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ లుక్, టైటిల్ ట్రెండ్ అవుతోంది. కన్నడలో పలు బ్లాక్‌బస్టర్‌లను అందించిన హర్ష.. ఈ భారీ బడ్జెట్ చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నారు. కుటుంబ భావోద్వేగాలు, ఇతర అంశాలతో కూడిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుందని నిర్మాత తెలుపుతున్నారు. (Bhimaa First Look)

Gopichand-1.jpg

అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకి స్వామి జె గౌడ (Swamy J Gowda) సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ‘కెజియఫ్’ ఫేమ్ రవి బస్రూర్ (Ravi Basrur) సంగీతం అందిస్తున్నారు. రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్, కిరణ్ ఎడిటర్. అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి వెంకట్, డాక్టర్ రవివర్మ యాక్షన్ కొరియోగ్రఫీ అందించనున్నారు. హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేయనున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Sreeleela: నిర్మాతలకు ‘నో’ చెబుతున్న శ్రీలీల

*************************************************************

* Matti Katha: ‘మట్టి కథ’కు మూడు అంతర్జాతీయ అవార్డులు

*****************************************************************

*Samantha: క్లబ్‌లో బీర్ కొడుతూ.. ‘ఊ అంటావా మావ’ పాటకి నాటు నాటు స్టెప్స్.. వీడియో వైరల్


*************************************************************

*VarunLav: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ ఫొటోలు

***********************************

*Sharwa-Rakshita: శర్వానంద్, రక్షితల వెడ్డింగ్ రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి

*************************************************************

Updated Date - 2023-06-12T16:58:07+05:30 IST