Samantha: క్లబ్‌లో బీర్ కొడుతూ.. ‘ఊ అంటావా మావ’ పాటకి నాటు నాటు స్టెప్స్.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2023-06-10T19:26:38+05:30 IST

గత కొంతకాలంగా మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని చెబుతున్న సమంత.. సినిమా షూటింగ్స్ విషయంలో మాత్రం చాలా చలాకీగా కనిపిస్తోంది. తాజాగా ఆమె చేస్తున్న ‘సిటాడెల్’ ఇండియన్ సిరీస్ నిమిత్తం సెర్బియాలో ఓ క్లబ్‌లో మందుకొడుతూ.. ‘పుష్ప’ సినిమాలోని తను చేసిన పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Samantha: క్లబ్‌లో బీర్ కొడుతూ.. ‘ఊ అంటావా మావ’ పాటకి నాటు నాటు స్టెప్స్.. వీడియో వైరల్
Samantha at Serbian Club

‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమా తర్వాత సమంత ‘ఖుషి’ (Kushi) సినిమాతో పాటు ‘సిటాడెల్’ (Citadel) వెబ్ సిరీస్‌లో చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ నిమిత్తం టీమ్ అంతా సెర్బియా (Serbia)లో ఉన్నారు. అక్కడ ఎంజాయ్ చేస్తున్న పిక్స్‌ని సోషల్ మీడియా వేదికగా సమంత షేర్ చేస్తూ ఉంది. తాజాగా సెర్బియాలోని ఓ క్లబ్‌లో బీర్ బాటిల్ చేతిలో పట్టుకుని.. ‘పుష్ప’ (Pushpa)లో తను చేసిన ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ పాటకు స్టెప్స్ వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సమంతను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ తరహాలో ఆమె ఎప్పుడూ కనబడలేదు.

Sam-2.jpg

ముఖ్యంగా బీర్ బాటిల్ పట్టుకుని.. క్లబ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి యమా ఎంజాయ్ చేస్తోంది. తన పక్కన కోస్టార్ వరుణ్ ధావన్ (Varun Dhavan) కూడా ఉన్నారు. తన చుట్టూ ఉన్నవారంతా ఎంకరేజ్ చేస్తుండటంతో.. సమంత కూడా ఊ అంటావా పాటకు స్టెప్స్ కుమ్మేసింది. అయితే గత కొంతకాలంగా సమంత మయోసైటీస్ (Myositis) అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగానూ, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లుగా చెబుతూ వస్తుంది. కానీ షూటింగ్ అంటే చాలు ఎక్కడా లేని ఎనర్జీ ఆమెకు వచ్చేస్తుంది. ఆమె ఎనర్జీని చూసిన వారంతా నిజంగా ఆమె వ్యాధితో బాధపడుతుందా? అనేలా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. క్లబ్‌లో ఇలా మందు కొడుతూ.. సమంత డ్యాన్స్ చేయడం.. మరింత అనుమానాలకు తావిచ్చేలా ఉందని కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం.. వ్యాధి ఉంది కదా అని బాధపడేకంటే.. ఇలా ఎంజాయ్ చేస్తే ఆ బాధని మరిచిపోవచ్చనే ఆమె అలా చేస్తుందని అంటున్నారు.

Sam.jpg

ఏది ఏమైతేనేం.. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత ఫ్రీ బర్డ్‌గా మారిందనేది మాత్రం కాదనలేని వాస్తవం. విడాకుల అనంతరం తను ఏం చేయాలంటే అది చేసేస్తుంది. టూర్స్, పార్టీలు, వెకేషన్, షూటింగ్స్ ఇలా ఏదంటే అది చేసేస్తూ.. ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో ‘టర్కీ’ వెళ్లొచ్చిన ఆమె.. ఇప్పుడు ‘సిటాడెల్’ ఇండియన్ సిరీస్ నిమిత్తం సెర్బియాలో సేద తీరుతోంది. అక్కడ బెల్‌గ్రేడ్‌లోని నైట్ క్లబ్‌లో ఇలా బీరు బాటిల్‌తో దర్శనమిచ్చింది. ఆమె సంగతి అలా ఉంటే.. ‘పుష్ప’లోని ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ సాంగ్‌కి సెర్బియాలో ఈ తరహాలో క్రేజ్ రావడం మాత్రం.. గ్రేట్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా అయితే.. ఈ వీడియో మాత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారింది.


ఇవి కూడా చదవండి:

************************************************

*VarunLav: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ ఫొటోలు

***********************************

*Sharwa-Rakshita: శర్వానంద్, రక్షితల వెడ్డింగ్ రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి

*Megha Akash: అవన్నీ వదంతులే.. మేఘా ఆకాష్ డేటింగ్ వార్తలపై తల్లి క్లారిటీ

*Mahi V Raghav: ‘సైతాన్’ వల్గర్ వెబ్ సిరీస్ కాదు.. అయినా ముందే హెచ్చరిక చేశాం

*Karthika: రెజీనా చదివే బుక్‌లో.. దెయ్యంగా కాజల్ అగర్వాల్!

*Anasuya: అలసిపోయాను.. ఇక ఆపేస్తున్నాను

Updated Date - 2023-06-10T19:36:24+05:30 IST