Mass Combo: మ్యాజికల్ మాస్ కాంబో ఈజ్ బ్యాక్.. కాకపోతే ఇవే డౌట్స్!

ABN , First Publish Date - 2023-12-13T21:40:41+05:30 IST

మ్యాజికల్ కాంబో మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబో మరోసారి సెట్టయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై.. నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మించనున్న ఎంటర్‌టైనర్ కోసం రవితేజ, హరీష్ శంకర్ మరోసారి చేతులు కలుపుతున్నారు. వివేక్ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాత. ఈ ప్రాజెక్ట్‌ని బుధవారం అధికారికంగా ప్రకటించారు.

Mass Combo: మ్యాజికల్ మాస్ కాంబో ఈజ్ బ్యాక్.. కాకపోతే ఇవే డౌట్స్!
Harish Shankar and Ravi Teja

మ్యాజికల్ కాంబో మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబో మరోసారి సెట్టయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్‌పై.. నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మించనున్న ఎంటర్‌టైనర్ కోసం రవితేజ, హరీష్ శంకర్ మరోసారి చేతులు కలుపుతున్నారు. వివేక్ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాత. హరీష్ శంకర్‌ని దర్శకుడిగా పరిచయం చేసింది రవితేజ అయితే, రవితేజకు మాస్ మహారాజా ట్యాగ్ ఇచ్చింది హరీష్. మరోవైపు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రవితేజ నటించిన ‘ధమాకా’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. దీంతో ఈ మాస్, క్రేజీ కాంబినేషన్‌లో చిత్రం ధమకేధార్ ఎంటర్‌టైనర్‌ను అందించబోతోంది.

ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాని బుధవారం అధికారికంగా అనౌన్స్ చేశారు. హరీష్ శంకర్ తన హీరోలను మ్యాసియస్ట్ అవతార్‌లో చూపించడంలో దిట్ట. రవితేజతో హరీష్ చేసిన గత చిత్రం ’మిరపకాయ్’ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమానులు, మాసెస్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కాంబినేషన్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ అఫీషియల్‌గా మాత్రం ప్రకటన రాలేదు. కారణం హరీష్ శంకర్ ప్రస్తుతం చేస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రమే. ఈ సినిమా షూటింగ్‌ ఎంత వరకు వచ్చిందనే దానిపై క్లారిటీ లేదు. మరో వైపు రాజకీయాలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Powerstar Pawan Kalyan) బిజీగా ఉన్నారు. దీంతో హరీష్ శంకర్ ఎప్పుడు ఫ్రీ అవుతాడా? అని అందరిలో డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)తో చేసే సినిమా పక్కన పెట్టి.. ఈ సినిమా చేయబోతున్నాడా? లేక ఆ సినిమా అయిన తర్వాతే ఈ సినిమా స్టార్ట్ అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది.


Harish-Shankar.jpg

ఇక ఈ మ్యాజికల్ మాస్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా ఎలాంటి మాస్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంటుందో తెలియజేయడానికి.. ‘ఈసారి మాస్ రీయూనియన్ స్పైసీగా ఉంటుంది’ అని మేకర్స్ క్లియర్‌గా క్లారిటీ ఇచ్చేశారు. హై ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌ కోసం హరీష్ శంకర్ ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేయనున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు. (Ravi Teja and Harish Shankar Combo)


ఇవి కూడా చదవండి:

====================

*Guntur Kaaram: ‘గుంటూరు కారం’ రెండో గీతం ఎలా ఉందంటే..

*****************************************

*Viraj Ashwin: హీరోగానే కంటిన్యూ చేస్తా.. ఏదైనా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర అయితే మాత్రం..?

*******************************

*Srinivas Avasarala: ‘స్మోక్’ అనే షార్ట్ ఫిల్మ్ చూస్తే.. కచ్చితంగా ‘పిండం’ చూస్తారు

************************************

*Ester Noronha: ‘మాయ’.. ఇలాంటి స్టోరీలు ఎలాగైనా ప్రేక్షకులకు తెలియాలి

**********************************

*Venkatesh: హీరోలందరి ఫ్యాన్స్ అభిమానించే సింగిల్ హీరో..

********************************

Updated Date - 2023-12-13T21:40:42+05:30 IST