Ester Noronha: ‘మాయ’.. ఇలాంటి స్టోరీలు ఎలాగైనా ప్రేక్షకులకు తెలియాలి

ABN , First Publish Date - 2023-12-13T17:09:00+05:30 IST

ఇలాంటి కథలు ప్రేక్షకులకు తెలియాలనే.. ‘మాయ’ సినిమాలో నటించానని అన్నారు హీరోయిన్ ఎస్త‌ర్ నోరోన్హా. ఆమె కీలక పాత్రలో.. జీరో ప్రొడక్షన్స్ సమర్పణలో విన్ క్లౌడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘మాయ’. రాజేష్ గొరిజవోలు నిర్మాణ సారథ్యంలో రమేష్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌ని తాజాగా హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో మేకర్స్ విడుదల చేశారు.

Ester Noronha: ‘మాయ’.. ఇలాంటి స్టోరీలు ఎలాగైనా ప్రేక్షకులకు తెలియాలి
Ester Noronha

ఇలాంటి కథలు ప్రేక్షకులకు తెలియాలనే.. ‘మాయ’ సినిమాలో నటించానని అన్నారు హీరోయిన్ ఎస్త‌ర్ నోరోన్హా (Ester Noronha). ఆమె కీలక పాత్రలో.. జీరో ప్రొడక్షన్స్ సమర్పణలో విన్ క్లౌడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘మాయ’ (Maya). రాజేష్ గొరిజవోలు నిర్మాణ సారథ్యంలో రమేష్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌ని తాజాగా హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో మేకర్స్ విడుదల చేశారు. మిస్టీరియస్ థ్రిల్లర్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో.. (Maya Teaser Launch Event)

హీరోయిన్ సిరి చందన (Siri Chandana) మాట్లాడుతూ.. డైరెక్టర్ రమేష్ నాని (Ramesh Nani) వంటి కూల్ డైరెక్టర్‌ని ఎక్కడా చూడలేదని ప్రశంసించారు. హీరో కిరణ్ చాలా సపోర్టివ్ అని, ఆయనతో పోటీపడి నటించానని తెలిపారు. ఎస్త‌ర్ నోరోన్హా ఇండస్ట్రీలో ఇంత పెద్ద పేరున్నా.. సెట్‌లో టీం అందరితో కలిసిపోయారన్నారు. డైరెక్టర్ రమేష్ నాని మొదటిసారి ఇంటికొచ్చి ఈ స్టోరీ చెప్పిన వెంటనే ఒప్పుకున్నానని హీరో కిరణ్ ఆవల (Kiran Aavala) తెలిపారు. చిన్న సినిమాలను తొక్కేశారని చాలామంది చెప్తుంటారు, కానీ సినిమాలో విషయం ఉంటే ఎవరు తొక్కలేరని మా చిత్రం నిరూపిస్తుందని నమ్మకంగా తెలిపారు. హీరోయిన్ సిరి చందన, ఎస్తర్‌లతో పాటు ఇందులో నటించిన వారందరితో పని చేయడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో టీం ఎంతో సపోర్ట్ చేసిందని డైరెక్టర్ రమేష్ నాని తెలిపారు. హీరోయిన్ ఎస్తర్‌కు స్టోరీ చెప్పినప్పుడు నిర్మాత ఎవరూ లేరని.. కేవలం ఆమె ఉన్నారన్న ధైర్యంతోనే ముందుకెళ్లామని అన్నారు. ఎస్తర్‌ను సౌత్ విద్యాబాలన్ (South Vidyabalan) అని ఆయన కొనియాడారు. పరిశ్రమలో సినిమా తీయడానికి చాలామంది ఒక ముసుగును ధరించి ఉంటారని కానీ మాయ టీం మాత్రం ఎంతో నిజాయితీగా చిత్రాన్ని తెరకెక్కించారని చౌదరి పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించిన ఎస్తర్‌ని చూస్తే 90లలో జయసుధ (Jayasudha)ను చూసినట్లు అనిపించిందని తెలిపారు. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అందరూ థియేటర్లో చూడాలని ఆయన కోరారు.


Maya-2.jpg

హీరోయిన్ ఎస్త‌ర్ నోరోన్హా (Ester Noronha) మాట్లాడుతూ.. ఒక సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు, లంచ్ బ్రేక్‌లో డైరెక్టర్ రమేష్ నాని ఈ కథ చెప్పారు. కథ విన్న వెంటనే ఓకే చేశాను. ఎందుకంటే, కథ చాలా కొత్తగా ఉంది.. అలాగే ఇలాంటి కథలు ఎలాగైనా ప్రేక్షకులకు తెలియాలని అనిపించింది. అన్ని క్రాఫ్ట్స్ కలిసి ఒక కుటుంబంలా చిత్రాన్ని తెరకెక్కించాం. ఇలాంటి టీం తో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. చెప్పిన కథను తెరకెక్కించడంలో డైరెక్టర్ రమేష్ నాని విజయం సాధించారు. ఆయనకు మంచి భవిష్యత్ ఉంటుంది. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. తప్పకుండా అందరూ థియేటర్లలోనే చూడండి అని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Venkatesh: హీరోలందరి ఫ్యాన్స్ అభిమానించే సింగిల్ హీరో..

********************************

*Devara: తమ్ముడి సినిమా ‘దేవర’పై కళ్యాణ్ రామ్ ఇంట్రస్టింగ్ అప్‌డేట్

*********************************

*Srikanth Sriram: హారర్ సినిమాల విషయంలో నాకో భయం ఉంది.. అదేంటంటే?

**********************************

Updated Date - 2023-12-13T17:09:01+05:30 IST