Venkatesh: హీరోలందరి ఫ్యాన్స్ అభిమానించే సింగిల్ హీరో..

ABN , First Publish Date - 2023-12-13T15:51:30+05:30 IST

విక్టరీ వెంకటేష్.. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు. టాలీవుడ్ స్టార్ నిర్మాత తనయుడే అయినా.. తన కష్టంతో విక్టరీని తన పేరు ముందు సంపాదించుకున్నారు. అంతేకాదు, ఎటువంటి కాంట్రవర్సీ దరిచేరనీయకుండా.. ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరి ఫ్యాన్స్ అభిమానించే సింగిల్ హీరో‌గా.. ముద్ర వేయించుకున్నారు. డిసెంబర్ 13 ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Venkatesh: హీరోలందరి ఫ్యాన్స్ అభిమానించే సింగిల్ హీరో..
Happy Birthday Victory Venkatesh

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh).. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు. టాలీవుడ్ స్టార్ నిర్మాత తనయుడే అయినా.. తన కష్టంతో విక్టరీని తన పేరు ముందు సంపాదించుకున్నారు. అంతేకాదు, ఎటువంటి కాంట్రవర్సీ దరిచేరనీయకుండా.. ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరి ఫ్యాన్స్ అభిమానించే సింగిల్ హీరో‌గా.. ముద్ర వేయించుకున్నారు. ‘కలియుగ పాండవులు’ సినిమాతో అరంగేట్రం చేసిన వెంకీ.. ఆ తర్వాత అన్ని రకాల పాత్రలతో ఆడియెన్స్‌ని అలరించి.. తనకంటూ ఓ బ్రాండ్‌ని క్రియేట్ చేసుకున్నారు. డిసెంబర్ 13 విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. (Venkatesh Birthday Special)

ట్రెండ్ సెట్టర్:

పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ (Pawan Kalyan’s Gabbar Singh) సినిమాలో ఓ డైలాగు ఉంటుంది.. ‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తా’ అని. ఆ డైలాగ్ వెంకీకి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఎందుకంటే.. వెంకీ ఒక జానర్‌లో సినిమా చేశారంటే.. ఆ తర్వాత వరసగా అదే జానర్‌లో ఇతర హీరోల సినిమాలు లైన్‌లోకి వస్తాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ (Tollywood)కి ‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో ఫ్యాక్షన్‌ని పరిచయం చేశాడు. ఆ తర్వాత హీరోలంతా ఫ్యాక్షన్‌పై పడ్డారు. అలాగే ఫ్యామిలీ, లవ్, కామెడీ.. ఇలా ఏదైనా సరే.. విక్టరీ మార్క్ పడాల్సిందే.


Venki.jpg

కామ్ గోయింగ్ పర్సన్:

విక్టరీ వెంకటేష్ కామ్ గోయింగ్ పర్సన్. అందుకే ఆయనకు ఎటువంటి కాంట్రవర్సీ దరిచేరదు. ఇతర హీరోల.. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలోని స్టార్ హీరోల, ఫ్యామిలీల కుటుంబాలకు సంబంధించి అనేక రకాలుగా వార్తలు వైరల్ అవుతున్నా.. వెంకీ ఫ్యామిలీకి సంబంధించి మాత్రం ఏనాడూ ఒక్క వార్త బయటికి రాలేదు. అంత గొప్పగా తన పర్సనల్ లైఫ్‌ని వెంకీ లీడ్ చేస్తుంటారు. విధిని, కర్మను నమ్మే మనిషి. ఎప్పుడూ దైవచింతనలో ఉంటుంటారు. మనకు ఏది రాసి పెట్టి ఉంటే.. అదే మనది అని నమ్మే వ్యక్తి వెంకటేష్. అందుకే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఎలాంటి ఈగో లేని పర్సన్ కాబట్టే.. అందరి హీరోల అభిమానులు ఆయనని అభిమానిస్తుంటారు.

క్రికెట్ ప్రియుడు (Cricket Lover):

దీనిని వ్యసనం అని అనలేం కానీ.. వెంకటేష్‌కి మాత్రం క్రికెట్ అంటే పిచ్చి. ముఖ్యంగా టీమ్ ఇండియా ఆడే మ్యాచ్‌లను తిలకించడానికి ఎంత దూరమైనా ఆయన వెళుతుంటారు. రీసెంట్‌గా జరిగిన క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్‌లలోనూ వెంకీ సందడి చేశారు. ఇంకా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పునాదికి కారణం కూడా వెంకీనే అనే చెప్పుకోవాలి. ఇప్పటికీ CCL సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుందంటే.. దాని వెనుక వెంకీ కృషి ఎంతో ఉంది. ఇదే.. ఇండస్ట్రీలోని కుర్ర హీరోలకు వెంకీని ఆరాధించేలా చేస్తుంది. (#HBDVictoryVenkatesh)


Venki-2.jpg

సంక్రాంతికి ‘సైంధవ్’ (Saindhav)గా..

రాబోయే సంక్రాంతి (Sankranthi)కి విక్టరీ వెంకటేష్ తన ల్యాండ్ మార్క్ ఫిల్మ్ (75వ చిత్రం)‌తో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. న్యూ ఏజ్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం వెంకీ ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకుడు. ‘సైంధవ్’ గురించి రీసెంట్‌గా జరిగిన ఓ కార్యక్రమంలో వెంకటేష్ (Venkatesh) మాట్లాడుతూ.. ముఫ్ఫై ఐదేళ్ళుగా సినీ ప్రయాణం కొనసాగుతోంది. అందరికీ నా చిత్రాలు నచ్చడం చాలా అనందంగా వుంది. మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. సైంధవ్ నా 75వ చిత్రం. చాలా ప్రత్యేకమైనది. నా మనసుకు దగ్గరైన చిత్రం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. జనవరి 13న సినిమా విడుదలవుతుంది. తప్పకుండా సినిమాని ఆదరిస్తారనే నమ్మకం వుంది. పండక్కి ఫ్యామిలీతో కలిసి అందరూ ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నానని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Devara: తమ్ముడి సినిమా ‘దేవర’పై కళ్యాణ్ రామ్ ఇంట్రస్టింగ్ అప్‌డేట్

*********************************

*Srikanth Sriram: హారర్ సినిమాల విషయంలో నాకో భయం ఉంది.. అదేంటంటే?

**********************************

*SeshEXShruti: అడివి శేష్‌తో శృతిహాసన్.. ఇది ఎవరూ ఊహించలేదు కదా..

**********************************

Updated Date - 2023-12-13T15:55:24+05:30 IST