Viraj Ashwin: హీరోగానే కంటిన్యూ చేస్తా.. ఏదైనా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర అయితే మాత్రం..?

ABN , First Publish Date - 2023-12-13T18:57:02+05:30 IST

‘బేబి’ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కిన విరాజ్ అశ్విన్‌.. ఆ చిత్రంతో ల‌వ‌ర్‌బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడీ యువ క‌థానాయ‌కుడు న‌టించిన తాజా చిత్రం ‘జోరుగా హుషారుగా’. పూజిత పొన్నాడ హీరోయిన్‌గా నటించగా అనుప్ర‌సాద్ ద‌ర్శ‌కత్వం వహించారు. నిరీష్ తిరువిధుల నిర్మించారు. డిసెంబర్ 15న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న నేపథ్యంలో హీరో విరాజ్ అశ్విన్‌.. మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

Viraj Ashwin: హీరోగానే కంటిన్యూ చేస్తా.. ఏదైనా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర అయితే మాత్రం..?
Viraj Ashwin

‘బేబి’ (Baby) సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కిన విరాజ్ అశ్విన్‌ (Viraj Ashwin).. ఆ చిత్రంతో ల‌వ‌ర్‌బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడీ యువ క‌థానాయ‌కుడు హీరోగా న‌టించిన తాజా చిత్రం ‘జోరుగా హుషారుగా’ (Jorugaa Husharugaa). శిఖర మరియు అక్షర ఆర్ట్స్ (ఎల్ఎల్‌పి) బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో పూజిత పొన్నాడ (Pujitha Ponnada) హీరోయిన్‌గా నటించగా అనుప్ర‌సాద్ (Anu Prasad) ద‌ర్శ‌కత్వం వహించారు. నిరీష్ తిరువిధుల (Nireesh Thiruveedula) నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న నేపథ్యంలో హీరో విరాజ్ అశ్విన్‌.. మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

‘బేబి’ త‌ర్వాత వ‌స్తున్న చిత్రం కావ‌డంతో ఏమైనా ఒత్తిడికి లోన‌వుతున్నారా?

‘బేబి’ చిత్రం హిట్ అవుతుంద‌ని అనుకున్నాం. కానీ ప్రేక్ష‌కులు అంత పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇస్తార‌ని అనుకోలేదు. ఆ సినిమా తర్వాత చాలా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. కానీ నేను బాధ్య‌త‌గా, చాలా సెలెక్టివ్‌గా వెళుతున్నాను. ఒక హిట్ సినిమా త‌ర్వాత వ‌స్తున్న సినిమాకు ఎంత పెద్ద హెల్ప్ అవుతుంద‌న‌డానికి ‘జోరుగా హుషారుగా’ మంచి ఉదాహ‌ర‌ణ‌. బేబి త‌ర్వాత వ‌స్తున్న ఈ సినిమాపై అంద‌రిలోనూ మంచి పాజిటివ్ వైబ్స్ వున్నాయి. నాకైతే వ్య‌క్తిగ‌తంగా కాస్త ప్రెజ‌ర్‌గా వున్నా.. సినిమా తప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం వుంది. (Hero Viraj Ashwin)

‘బేబి’లో విరాజ్ పాత్ర‌కు.. ఈ చిత్రంలోని పాత్ర‌కు ఉన్న తేడా ఏమిటి?

ఆ చిత్రంలో ధ‌నిక యువ‌కుడిగా క‌నిపించాను. ఈ చిత్రంలో ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిగా క‌నిపిస్తాను. చేనేత కుటుంబానికి చెందిన యువ‌కుడిగా నాలో చాలా ఎమోష‌న్స్ వుంటాయి. ఎన్నిక‌ష్టాలున్నా మ‌న‌సులో దాచుకుని బ‌య‌టికి సంతోషంగా క‌నిపించే యువ‌కుడిగా నా పాత్ర అంద‌రిని ఎంట‌ర్‌టైన్ చేసే విధంగా వుంటుంది. ప‌ర్స‌న‌ల్‌గా నాకు నా పాత్ర ఎంతో కనెక్ట్ అయ్యింది. బేబిలో పాత్ర‌కు పూర్తి భిన్న‌మైన పాత్ర‌లో క‌నిపిస్తాను.

‘బేబి’ తర్వాత కెరీర్ ఎలా వుంది?

ముందుతో పొల్చితే హీరోగా చాలా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఆ సినిమా తర్వాత దాదాపు అన్ని జాన‌ర్‌ల క‌థ‌లు విన్నాను. అయితే బేబి ప్ర‌భావంతో ఎక్కువగా ల‌వ‌ర్‌బాయ్ పాత్ర‌లే వ‌స్తున్నాయి. అయితే నేను మాత్రం క‌థ‌, నా పాత్ర న‌చ్చితే సినిమా ఒప్పుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాను. (Viraj Ashwin Interview)


Viraj-Ashwin.jpg

‘జోరుగా హుషారుగా’ చిత్రం ఎలా వుండ‌బోతోంది?

ఈ చిత్రంలో ముఖ్యంగా ఫాద‌ర్ అండ్ స‌న్ ఎమోష‌న్ అంద‌ర్నీ క‌ట్టిప‌డేస్తుంది. ఒక మిడిల్ క్లాస్ ఫాద‌ర్ త‌న కొడుకును ప్రయోజకుడిని చేయ‌డానికి ఎలాంటి త్యాగాలు చేశాడు? ఫ్యామిలీ కోసం కొడుకు ఏం చేశాడు? అనేది ఎంతో ఎమోష‌న్‌గా వుంటుంది.

‘హాయ్ నాన్న‌, యానిమ‌ల్‌’.. ఇప్పుడు ‘జోరుగా హుషారుగా’. ఇవన్నీ ఫాద‌ర్ ఎమోష‌న్ సినిమాలే.. ఇవన్నీ ఈ నెల‌లోనే విడుద‌ల కావ‌డం ఎలా అనిపిస్తుంది?

ఇది కాక‌తాళీయంగా, స‌ర్‌ప్రైజింగ్‌గా వుంది. మ‌న లైఫ్‌లో బిగ్గెస్ట్ ఎమోష‌న్ ఫాద‌ర్ ఎమోష‌న్‌. నిజంగా చాలా ఆనందంగా వుంది. త‌ప్ప‌కుండా మా సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది. (Viraj Ashwin About Jorugaa Husharugaa)

‘హాయ్ నాన్న’ (Hi Nanna)లో మీరు యాక్ట్ చేయ‌డం, అందులో నాని విరాజ్‌గా క‌నిపించ‌డం ప‌ట్ల మీ స్పంద‌న‌?

ఆ చిత్ర ద‌ర్శ‌క‌త్వం టీమ్ అంతా నా ఫ్రెండ్స్ కావ‌డంతో ఆ సినిమాలో న‌టించాను. ఆ చిత్రంలో నాని విరాజ్ పాత్ర‌లో క‌నిపించ‌డం నిజంగా కో ఇన్‌సిడెంట్ అంతే. ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలో విరాజ్ అంటే నేను ప‌ల‌క‌డం, హాయ్ నాన్న ప్రీరిలీజ్ వేడుక‌లో విరాజ్ అన‌గానే అంద‌రూ నేను అనుకోవడం, ఇలా చాలా ఫ‌న్నీగా, సంతోషంగా అనిపించింది.

హీరోగానే కంటిన్యూ చేస్తారా?

ప్ర‌స్తుతానికి హీరోగానే కంటిన్యూ చేస్తాను. న‌చ్చిన పాత్ర‌లు, ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర అయితే ఇత‌ర హీరోల సినిమాల్లో కూడా క‌నిపిస్తాను.

ఫైన‌ల్‌గా జోరుగా హుషారుగా ఎలాంటి సినిమా?

ఈ చిత్రంలో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎమోష‌న్‌, ల‌వ్‌.. ఇలా అన్నీ వుంటాయి. ఇదొక లైట్ హార్టెడ్ సినిమా. అంద‌రూ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తార‌నే న‌మ్మ‌కం వుంది.


ఇవి కూడా చదవండి:

====================

*Srinivas Avasarala: ‘స్మోక్’ అనే షార్ట్ ఫిల్మ్ చూస్తే.. కచ్చితంగా ‘పిండం’ చూస్తారు

************************************

*Ester Noronha: ‘మాయ’.. ఇలాంటి స్టోరీలు ఎలాగైనా ప్రేక్షకులకు తెలియాలి

**********************************

*Venkatesh: హీరోలందరి ఫ్యాన్స్ అభిమానించే సింగిల్ హీరో..

********************************

Updated Date - 2023-12-13T18:57:05+05:30 IST