Dheera Glimpse: అవతల వాడు ఒక్కడే.. వార్‌ని కూడా వామప్‌లా చేశాడు

ABN , First Publish Date - 2023-10-09T16:16:21+05:30 IST

‘వలయం’, ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ వంటి సినిమాలతో హీరోగా లక్ష్ చదలవాడ ప్రేక్షకులలో మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు. ఇప్పుడాయన పూర్తి మాస్ యాక్షన్ మూవీ ‘ధీర’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం హీరో లక్ష్ చదలవాడ పుట్టిన రోజు సందర్భంగా ‘ధీర’ నుంచి మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి ఓ పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Dheera Glimpse: అవతల వాడు ఒక్కడే.. వార్‌ని కూడా వామప్‌లా చేశాడు
Laksh Chadalavada in Dheera

‘వలయం’, ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ వంటి సినిమాలతో హీరోగా లక్ష్ చదలవాడ (Laksh Chadalavada) ప్రేక్షకులలో మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు. ఇప్పుడాయన పూర్తి యాక్షన్ మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘ధీర’ (Dheera) అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్ (Sri Tirumala Tirupati Venkateswara Films) బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ (Padmavathi Chadalavada) నిర్మిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు. సోమవారం హీరో లక్ష్ చదలవాడ పుట్టిన రోజు సందర్భంగా ‘ధీర’ నుంచి మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి ఓ పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. (Dheera Glimpse)

హీరోయిజాన్ని హైలెట్ చేసేలా ఉన్న ఈ గ్లింప్స్‌ ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ గ్లింప్స్‌లో డైలాగ్స్, విజువల్స్, ఆర్ఆర్ అన్నీ హైలెట్ అనేలా ఉన్నాయి. ‘ఇరవై మంది వెళ్లారు కదరా?’.. అని విలన్ వాయిస్ అడిగితే.. ‘అవతల వాడు ఒక్కడే.. వార్‌ని కూడా వామప్‌లా చేశాడు..’ అని.. అతని అనుచరుడు చెప్పే డైలాగ్‌తో డైరెక్టర్ విక్రాంత్ లక్ష్ హీరోయిజాన్ని అమాంతం ఎలివేట్ చేశారు. ఈ గ్లింప్స్‌లో లక్ష్ లుక్స్, మ్యానరిజం అన్నీ కొత్తగా ఉన్నాయి. త్వరలోనే ఈ మూవీ థియేటర్లోకి రాబోతోంది. (Dheera Update)


Chadalavada.jpg

ఈ గ్లింప్స్ విడుదల సందర్భంగా దర్శకుడు విక్రాంత్ శ్రీనివాస్ (Vikranth Srinivas) మాట్లాడుతూ.. మా హీరో లక్ష్‌కి మా యూనిట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన బర్త్‌డే స్పెషల్‌గా విడుదల చేసిన ‘ధీర’ గ్లింప్స్‌కు మంచి స్పందన వస్తోంది. సాయి కార్తీక్ సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కంటెంట్ ఇందులో ఉంటుంది. అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

============================

*Sreeleela: కట్ చెప్పిన తర్వాత కూడా అదే ఎమోషన్‌లో ఉండేదాన్ని..

************************************

*Chiranjeevi: మీ మాటను వెనక్కి తీసుకోవాలి.. సినీ జర్నలిస్ట్‌ను కోరిన చిరు!

**********************************

*NBK: ‘భగవంత్ కేసరి’ ట్రైలర్‌లో చూసింది కొంతే.. చూడాల్సింది చాలా ఉంది.. అదంతా దాచి పెట్టాం!

*************************************

*Ganjam: మ్యారేజ్ అనంతరం త్రిగుణ్ చేస్తున్న సినిమా ఇదే.. టీజర్ విడుదల

**********************************

*Ayalaan: ట్రెండింగ్‌లో ‘అయలాన్‌’.. అందుకే సంక్రాంతికి అంటోన్న ఎస్.కె.

*************************************

*Manchu Lakshmi: మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ లుక్.. అరాచకం అంతే..!

**************************************

Updated Date - 2023-10-09T16:16:32+05:30 IST