Dil Se: ‘బేబీ’ తరహాలో మరో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. రిలీజ్ ఎప్పుడంటే..?

ABN , First Publish Date - 2023-07-27T19:00:40+05:30 IST

ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ‘బేబీ’ సినిమా కుండపోత వర్షంలోనూ కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ‘బేబీ’ కలెక్షన్స్ చూసి బాక్సాఫీస్ షేకవుతుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకుని.. ఇంకా దూసుకెళుతూనే ఉంది. ఇప్పుడిదే తరహాలో మరో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘దిల్ సే’ చిత్రం ఆగస్ట్ 4న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Dil Se: ‘బేబీ’ తరహాలో మరో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. రిలీజ్ ఎప్పుడంటే..?
Dil Se Movie Pic

ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ‘బేబీ’ సినిమా కుండపోత వర్షంలోనూ కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ‘బేబీ’ కలెక్షన్స్ చూసి బాక్సాఫీస్ షేకవుతుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకుని.. ఇంకా దూసుకెళుతూనే ఉంది. ఇప్పుడిదే తరహాలో మరో ట్రయాంగిల్ లవ్ స్టోరీ సిద్ధమవుతోంది. శ్రీ చైతన్య క్రియేషన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై అభినవ్ మదిశెట్టి (Abhinav Medishetty), శాషా సింగ్ (Sasha Singh) హీరో హీరోయిన్లుగా మంకల్ వీరేంద్ర (Mankal Virendra), రవికుమార్ సబ్బాని (Ravikumar Sabbani) స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘దిల్ సే’ (Dil Se). ప్రస్తుతం షూటింగ్ అనంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 4న థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


ఇటీవల విడుదలైన ఈ సినిమా మొదటి సాంగ్ ‘రెండు కన్నులతో’ మంచి స్పందన రాబట్టుకుని.. టాప్‌లో ట్రెండ్ అయింది. లహరి మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట.. 2 మిలియన్ వ్యూస్‌కు చేరుకుంది. శ్రేయ ఘోషల్ (Shreya Ghoshal) పాడిన ఈ పాటకు నూతన సంగీత దర్శకుడు శ్రీకర్ (Srikar) సంగీతం అందించారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా నచ్చే విధంగా ‘దిల్ సే’ ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. వన్ మీడియా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతోంది.

Dil-Se-1.jpg

‘‘కంటెంట్ ఉంటే.. చిన్న సినిమాలైనా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తున్నాయి. మా సినిమా కూడా కంటెంటే ప్రధానంగా ఉండబోతోంది. యూత్ లవ్ స్టోరీస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వారందరికీ ఈ సినిమా సరికొత్త ఫీల్ ఇచ్చేలా ఉంటుంది. ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. కచ్చితంగా అందరినీ అలరించే చిత్రమిదవుతుంది’’ అని దర్శకనిర్మాతలు తెలిపారు. (Dil Se Ready to Release)


ఇవి కూడా చదవండి:

**************************************

*Rajasekhar: ‘గబ్బర్‌సింగ్‌’లో పవన్.. ‘భోళా శంకర్’లో చిరు.. మాములుగా వాడలేదుగా..

**************************************

*Jailer: తెలుగులోనూ దుమ్మురేపుతోన్న తమన్నా ఆట.. ‘జైలర్’ పాట

**************************************

*Tamannaah Bhatia: రెండు కోట్ల డైమండ్.. అసలు సీక్రెట్ రివీల్ చేసిన తమన్నా

**************************************

*Bholaa Shankar: గ్లోబల్ స్టార్ చేతుల మీదుగా ట్రైలర్.. టైమింగ్ అదిరింది

**************************************

*Sai Dharam Tej: చిన మామయ్యతో సినిమా.. పెద మామయ్య ఏమన్నారంటే..

**************************************

*Samuthirakani: ఆ చిరునవ్వుని ఎప్పటికీ మరిచిపోలేను..

**************************************

Updated Date - 2023-07-27T19:00:40+05:30 IST