Bhagavanth Kesari: మ్యూజికల్ ప్రమోషన్స్‌లో బాలయ్య ‘భగవంత్ కేసరి’.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..?

ABN , First Publish Date - 2023-08-24T17:13:28+05:30 IST

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘భగవంత్ కేసరి’. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర మ్యూజికల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసి.. ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

Bhagavanth Kesari: మ్యూజికల్ ప్రమోషన్స్‌లో బాలయ్య ‘భగవంత్ కేసరి’.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..?
Bhagavanth Kesari Poster

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari). షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన అప్‌డేట్స్ అన్నీ సినిమాపై భారీగా అంచనాలు పెంచేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ‘భగవంత్ కేసరి’ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించినట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ ‘గణేష్’ సాంగ్‌ను సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. (Bhagavanth Kesari First Single Announcement)


బాలకృష్ణ గత చిత్రం ‘అఖండ’కు బాక్స్‌లు బద్దలయ్యేలా మ్యూజిక్ అందించిన ఎస్ఎస్ థమన్.. భగవంత్ కేసరి కోసం సెన్సేషనల్ ఆల్బమ్‌ను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు రాబోతోన్న ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన టైటిల్, పోస్టర్ చూస్తుంటే ఇది మాస్ నంబర్ అవుతుందనేలా తెలుస్తోంది. ఈ పోస్టర్‌లో ఇంతకు ముందెన్నడూ లేని మాస్ అవతార్‌లో డ్రమ్స్ కొడుతూ కనిపించారు బాలకృష్ణ. పాటలోని ఎనర్జీ ఆయన ఫేస్‌లోనే కనిపిస్తుంది. డ్యాన్సర్‌లతో కలర్‌ఫుల్‌గా ఉంది పోస్టర్. దసరాకి అసలు సిసలైన సినిమా ఇదనేలా ఈ పోస్టర్‌తో మేకర్స్ క్లారిటీ ఇచ్చినట్లుగా పోస్టర్‌ని డిజైన్ చేశారు.

Bala.jpg

ఈ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ టెర్రిఫిక్ రెస్పాన్స్‌‌ని రాబట్టుకోవడమే కాకుండా.. బాలకృష్ణ తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కిచ్చాయి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్ నటిస్తుండగా, శ్రీలీల (Sreeleela) కీలక పాత్రలో కనిపించనుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ‘భగవంత్ కేసరి’ భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*Sathyaraj: సూపర్‌స్టార్‌ అంటే రజనీనే.. ఆ వార్‌కి చెక్

***************************************

*Sukanya: ఐదు పదుల వయసులో మరో పెళ్లా? నటి సుకన్య షాకైన వేళ..

***************************************

*Pawan Kalyan: మన అంతరిక్ష చరిత్రలో సువర్ణ అధ్యాయం

***************************************

*Chandrayaan-3: చంద్రునిపై హాలీడే జరుపుకునే రోజు ఇంకెంతో దూరంలో లేదు.. సెలబ్రిటీల అభినందనలు

***************************************

*Kushi: విజయ్ దేవరకొండ, సమంతల ‘ఖుషి’ సినిమా నిడివి ఎంతో తెలుసా?

***************************************

Updated Date - 2023-08-24T17:40:13+05:30 IST