Sukanya: ఐదు పదుల వయసులో మరో పెళ్లా? నటి సుకన్య షాకైన వేళ..

ABN , First Publish Date - 2023-08-23T21:51:08+05:30 IST

సీనియర్‌ నటి సుకన్య మరో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె వివరణ ఇచ్చారు. ఐదు పదుల వయసులో ఉన్న తనకు మరో పెళ్లా అంటూ ఒక్కసారిగా ఆమె షాకవుతూ.. ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక వేళ ఇంకో పెళ్లి చేసుకుని పిల్లలకు జన్మనిస్తే వారు తనను అమ్మ అని పిలవాలా? లేక అమ్మమ్మ అని పిలవాలా? అని ప్రశ్నించారు.

Sukanya: ఐదు పదుల వయసులో మరో పెళ్లా? నటి సుకన్య షాకైన వేళ..

సీనియర్‌ నటి సుకన్య (Senior Actress Sukanya) మరో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె వివరణ ఇచ్చారు. ఐదు పదుల వయసులో ఉన్న తనకు మరో పెళ్లా అంటూ ఒక్కసారిగా ఆమె షాకవుతూ.. ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక వేళ ఇంకో పెళ్లి చేసుకుని పిల్లలకు జన్మనిస్తే వారు తనను అమ్మ అని పిలవాలా? లేక అమ్మమ్మ అని పిలవాలా? అని ప్రశ్నించారు. 1991లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన ‘పుదు నెల్లు పుదు నాత్తు’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన సుకన్య... ఆ తర్వాత ‘మహానది, చిన్న గౌండర్‌, వాల్టర్‌ వెట్రివేల్‌, ఇండియన్‌’ వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు.


తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితమే. ‘పెద్దరికం, సాంబ, శ్రీ, మున్నా, అధినాయకుడు, శ్రీమంతుడు’ వంటి చిత్రాలలో సుకన్య నటించారు. కాగా ఆమెకు 2002లో శ్రీధరన్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుని అమెరికాకు వెళ్లారు. కానీ, ఒక యేడాదిలోనే భర్తతో తెగదెంపులు చేసుకున్న సుకన్య.. స్వదేశానికి వచ్చి అడపాదడపా చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మరో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం సాగుతోంది. దీనిపై సుకన్య స్పందించారు. (Sukanya Shocking Comments on Marriage Rumours)

Sukanya-Pic-2.jpg

తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకు అలాంటి ఆలోచన నాకు లేదు. ఇప్పుడు నాకు 50 ఏళ్లు. ఇకపై పెళ్లి, పిల్లలు, సంసారం అంటూ పోతే... నాకు పుట్టే పిల్లలు నన్ను అమ్మ అని పిలుస్తారా? అమ్మమ్మ అని పిలుస్తారా? అనే ఆలోచన నామదిలో మెదులుతోంది’’ అని అన్నారు. అయినప్పటికీ ఆమె మరో పెళ్లి వద్దనికానీ, కావాలని కానీ చెప్పకపోవడం గమనార్హం.


ఇవి కూడా చదవండి:

***************************************

*Pawan Kalyan: మన అంతరిక్ష చరిత్రలో సువర్ణ అధ్యాయం

***************************************

*Chandrayaan-3: చంద్రునిపై హాలీడే జరుపుకునే రోజు ఇంకెంతో దూరంలో లేదు.. సెలబ్రిటీల అభినందనలు

***************************************

*Kushi: విజయ్ దేవరకొండ, సమంతల ‘ఖుషి’ సినిమా నిడివి ఎంతో తెలుసా?

***************************************

*800: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్.. ఇండియా హక్కులు ఎవరికంటే..

***************************************

Updated Date - 2023-08-23T21:51:08+05:30 IST