Sathyaraj: సూపర్‌స్టార్‌ అంటే రజనీనే.. ఆ వార్‌కి చెక్

ABN , First Publish Date - 2023-08-23T23:40:10+05:30 IST

గత 45 ఏళ్ళుగా సూపర్‌స్టార్‌ అనగానే రజనీకాంత్‌ గుర్తుకు వస్తారు. ఈ విషయంలో ఎలాంటి మార్పులేదు అని సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ స్పష్టం చేశారు. ఆయన పోలీస్‌ అధికారి పాత్రలో విలన్‌గా నటించిన సినిమా ‘అంగాకగన్‌’. సెప్టెంబరు 8న విడుదల కాబోతోన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకలో.. కోలీవుడ్‌లో సూపర్ స్టార్‌పై జరుగుతున్న వార్‌కి సత్యరాజ్ చెక్ పెట్టారు.

Sathyaraj: సూపర్‌స్టార్‌ అంటే రజనీనే.. ఆ వార్‌కి చెక్

గత 45 ఏళ్ళుగా సూపర్‌స్టార్‌ అనగానే రజనీకాంత్‌ (Rajinikanth) గుర్తుకు వస్తారు. ఈ విషయంలో ఎలాంటి మార్పులేదు అని సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ స్పష్టం చేశారు. జోమోన్‌ ఫిలిప్‌, జీనా జోమోన్‌ సమర్పణలో ప్రైమ్‌రోజ్‌ ఎంటర్‌టైన్మెంట్‌, జులీనా అండ్‌ జెరోమా ఫిల్మ్‌ కంపెనీలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘అంగాకగన్‌’ (Angaragan). ఇందులో హీరోగా శ్రీపతి నటించగా, పోలీస్‌ అధికారి పాత్రలో విలన్‌గా సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ నటించారు. మలయాళ నటి నియా హీరోయిన్‌. హీరోగా నటించిన శ్రీపతి స్ర్కీన్‌ప్లే సమకూర్చడమే కాకుండా, క్రియేటివ్‌ డైరెక్టరుగా కూడా పనిచేశారు. ఇతర పాత్రల్లో మహేష్‌, రైనా కారత్‌, రోషన్‌, అప్పుకుట్టి, దియా నేహా రోజ్‌, గురుచంద్రన్‌, కేసీపీ ప్రసాద్‌ తదితరులు నటించారు. బాలీవుడ్‌ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన మోహన్‌ డచ్చు దర్శకత్వం వహించారు. సెప్టెంబరు 8న ఈ సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో సత్యరాజ్‌ మాట్లాడుతూ... ‘‘గత 45 యేళ్లుగా సూపర్‌స్టార్‌ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది రజనీకాంత్‌ ఒక్కరే. ఏళిసై మన్నర్‌, మక్కల్‌ తిలగం, నడిగర్‌ తిలగం వంటి ట్యాగ్‌లు కాలానికి అనుగుణంగా మారినప్పటికీ ఒక్కో ట్యాగ్‌ ఒక్కొక్కరికి సొంతం. రజనీకాంత్‌ను మక్కల్‌ తిలగం అంటే అంగీకరిస్తారా? ‘దశావతారం’ చిత్రంలో కమల్‌ హాసన్‌ అద్భుతంగా నటించారు. ఆయన్ను నడిగర్‌ తిలగం అని అనగలమా? అందువల్ల ‘సూపర్‌స్టార్‌’ అంటే రజనీకాంత్‌. ‘ఉలగనాయకన్‌’ అంటే కమల్‌ హాసన్‌. ‘దళపతి’ అంటే విజయ్‌. ‘తల’ అంటే అజిత్‌’’ అని అన్నారు. అయితే, సత్యరాజ్‌ ఇలా మాట్లాడటానికి కారణం లేకపోలేదు... గత కొన్ని రోజులుగా సూపర్‌స్టార్‌ ట్యాగ్‌పై రజనీకాంత్‌, విజయ్‌ అభిమానుల మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. దీనికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టేలా సత్యరాజ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*Sukanya: ఐదు పదుల వయసులో మరో పెళ్లా? నటి సుకన్య షాకైన వేళ..

***************************************

*Pawan Kalyan: మన అంతరిక్ష చరిత్రలో సువర్ణ అధ్యాయం

***************************************

*Chandrayaan-3: చంద్రునిపై హాలీడే జరుపుకునే రోజు ఇంకెంతో దూరంలో లేదు.. సెలబ్రిటీల అభినందనలు

***************************************

*Kushi: విజయ్ దేవరకొండ, సమంతల ‘ఖుషి’ సినిమా నిడివి ఎంతో తెలుసా?

***************************************

*800: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్.. ఇండియా హక్కులు ఎవరికంటే..

***************************************

Updated Date - 2023-08-23T23:40:10+05:30 IST