Kushi: విజయ్ దేవరకొండ, సమంతల ‘ఖుషి’ సినిమా నిడివి ఎంతో తెలుసా?

ABN , First Publish Date - 2023-08-23T16:16:18+05:30 IST

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. సెప్టెంబర్ 1న అంటే మరో 9 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని.. సెన్సార్ నుంచి యుబైఏ సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది.

Kushi: విజయ్ దేవరకొండ, సమంతల ‘ఖుషి’ సినిమా నిడివి ఎంతో తెలుసా?
Vijay Deverakonda and Samantha In Kushi

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన ‘ఖుషి’ (Kushi) రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. సెప్టెంబర్ 1న అంటే మరో 9 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ నుంచి ఈ సినిమాకి యూబైఏ సర్టిఫికేట్ జారీ చేశారు. దీంతో ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోంది.


మొదటి నుంచి ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. సినిమా టైటిల్ నుంచి టీజర్, పాటలు, ట్రైలర్‌తో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన సినిమా ‘ఖుషి’. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్‌తో పాటు లవ్, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ రూపొందించడంలో దర్శకుడు శివ నిర్వాణ హిట్ ట్రాక్, మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ గ్రాండియర్.. ఇవన్నీ కలిపి ‘ఖుషి’ మీద భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేశాయి. ఇప్పుడు సెన్సార్ నుంచి వినిపిస్తున్న టాక్‌తో ఈ సినిమాతో ప్రేక్షకులు ‘ఖుషి’ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. (Kushi Censor Details)

Kushi.jpg

ఈ సినిమా నిడివి విషయానికి వస్తే.. 165 నిమిషాల నిడివి (2గంటల 45 నిమిషాలు)తో ఈ మూవీకి సెన్సార్ బృందం యూబైఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇప్పటి వరకు ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా బ్లాక్ బస్టర్ హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రికార్డ్ చూస్తే అవన్నీ రెగ్యులర్ మూవీస్‌కు కనీసం 20 నిమిషాల లెంగ్త్ ఎక్కువ ఉన్నవే. కథలో ప్రేక్షకులు లీనమైతే కాస్త ఎక్కువ లెంగ్త్ సమస్య కాదని గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ప్రూవ్ చేశాయి. ‘ఖుషి’ ఔట్ పుట్ మీద టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇటీవల మ్యూజిక్ కన్సర్ట్ సూపర్ హిట్టయ్యింది. ఆడియెన్స్‌లోనూ ఈ సినిమాపై కావాల్సినంత బజ్ ఏర్పడింది. ఇంకా అందరూ వెయిట్ చేస్తున్నది ‘ఖుషి’ ఫస్ట్ డే ఫస్ట్ షో కోసమే. తెలుగుతో పాటు తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. (Kushi Run Time Locked)


ఇవి కూడా చదవండి:

***************************************

*800: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్.. ఇండియా హక్కులు ఎవరికంటే..

***************************************

*Varun Tej: కమర్షియల్ సినిమాలు చేయమని సలహాలు ఇస్తున్నారు.. కానీ?

***************************************

*Jawan: ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. 6గురు యాక్షన్ డైరెక్టర్స్.. ‘జవాన్’ రేంజ్ ఇది

***************************************

Updated Date - 2023-08-23T16:16:18+05:30 IST