Chandrayaan-3: చంద్రునిపై హాలీడే జరుపుకునే రోజు ఇంకెంతో దూరంలో లేదు.. సెలబ్రిటీల అభినందనలు

ABN , First Publish Date - 2023-08-23T19:16:38+05:30 IST

చందమామపై భారత్ చెరగని ముద్రవేసింది. చరిత్రాత్మక ఘట్టంతో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సరికొత్త చరిత్రను లిఖించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 మిషన్ ‘ల్యాండర్ విక్రమ్’ విజయవంతంగా సాఫ్ట్‌గా (Soft landing) లాండయ్యింది.

Chandrayaan-3:  చంద్రునిపై హాలీడే జరుపుకునే రోజు ఇంకెంతో దూరంలో లేదు.. సెలబ్రిటీల అభినందనలు
Chandrayaan-3

చందమామపై భారత్ చెరగని ముద్రవేసింది. చరిత్రాత్మక ఘట్టంతో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సరికొత్త చరిత్రను లిఖించింది. ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తుండగా.. కోట్లాది భారతీయుల ప్రార్థనలు ఫలించగా.. రెండు రోజులక్రితం రష్యా లూనా-25 మిషన్ కుప్పకూలిన చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 మిషన్ ‘ల్యాండర్ విక్రమ్’ విజయవంతంగా సాఫ్ట్‌గా (Soft landing) లాండయ్యింది. జాబిల్లిపై చంద్రయాన్ 3 అడుగు పెట్టిన సందర్భంగా భారతీయులందరూ గర్వపడుతూ.. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతున్నారు.


మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ట్విట్టర్ వేదికగా.. ఈ రోజు సరికొత్త చరిత్ర లిఖించబడిందని.. చంద్రునిపై హాలీడే జరుపుకునే రోజు ఇంకెంతో దూరంలో లేదని అంటూ.. తన సంతోషాన్ని తెలియజేశారు. ఇంత గొప్ప విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఈ అద్భుతమైన క్షణం కోసం వేచి చూస్తున్న బిలియన్ల మంది భారతీయులతో నేను చేరిపోయానని అన్నారు. ఇది చంద్రునిపై అమూల్యమైన ఆవిష్కరణలకు మరియు రాబోయే రోజుల్లో మరిన్ని శాస్త్రీయ మిషన్లకు స్పష్టంగా మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నట్లుగా తెలిపారు. (Chandrayaan-3 Success)


చరిత్ర సృష్టించిన భారత శాస్త్రవేత్తలు..!: బాలకృష్ణ

చంద్రుని దక్షణ ధృవం పై ఇస్రో ద్వారా చంద్రయాన్-3 విజయవంతం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్-3 విజయవంతంగా ప్రయోగించి చంద్రుడిపై ఉన్న ఆసక్తికర అంశాలను మానవాళికి అందించడంలో ముందడుగు వేసారు ఇస్రో శాస్త్రవేత్తలు. చంద్రుడుపై నివాస యోగ్యత, నీటి లభ్యత, జీవరాసుల మనుగడకు సంబందించిన సమాచారం ప్రపంచానికి చేరవేయడంలో భారతదేశం ముందుంటుంది. ఎన్నో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారిన భారత శాస్త్రవేత్తలకు, శాస్త్రవేత్తలను ప్రోత్సహించిన భారత ప్రభుత్వానికి శుభాకాంక్షలు. శాస్త్ర సాంకేతిక, బౌగోళిక, చంద్రమండల, అంతరిక్ష రంగాల్లో భారత్ గణనీయమైన అభివృద్ది సాధించాలని కోరుకుంటున్నాను. 140కోట్ల భారతీయుల కలను సాకారం చేసిన భారత శాస్త్రవేత్తలకు మరోక్కసారి శుభాభినందనలు.


చిరంజీవి, బాలకృష్ణలతో పాటు మోహన్ బాబు, మహేష్ బాబు, ఎస్. ఎస్. రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, సాయి ధరమ్ తేజ్, మంచు విష్ణు, కళ్యాణ్ రామ్, నితిన్, విజయ్ దేవరకొండ, సత్యదేవ్, నవీన్ పోలిశెట్టి, జీఏ2 పిక్చర్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. ట్విట్టర్ వేదికగా ఈ అపూర్వమైన సక్సెస్‌ను కొనియాడుతూ.. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.


Prabhas.jpg

Updated Date - 2023-08-23T19:52:01+05:30 IST