Samantha: సమంతని వదలని చిట్టిబాబు.. ఇదో ‘రంగస్థలం’ అవుతుందేమో..

ABN , First Publish Date - 2023-04-26T17:45:14+05:30 IST

ఈ మధ్య సమంతపై చిట్టిబాబు అనే నిర్మాత చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలో.. సమంత గురించి తనకు అంతా తెలుసు అన్నట్లుగా

Samantha: సమంతని వదలని చిట్టిబాబు.. ఇదో ‘రంగస్థలం’ అవుతుందేమో..
Samantha and Chitti Babu

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఫోకస్ పెట్టడం లేదు కానీ.. కొన్ని రోజులుగా సోషల్ మాధ్యమాలలో హీరోయిన్ సమంత (Samantha), నిర్మాత చిట్టిబాబు(Chittibabu)ల మధ్య జరుగుతున్న ఎపిసోడ్స్‌తో ఓ మాంచి సినిమాని ప్లాన్ చేసేవాడు. సమంత, చిట్టిబాబు అంటే అందరికీ ‘రంగస్థలం’ (Rangasthalam) సినిమా గుర్తు వస్తుంది కాబట్టి.. ఈ చిట్టిబాబు, సమంతల మధ్య జరుగుతున్న కామెంట్ల యుద్ధానికి ‘రంగస్థలం 2’ పేరుతో వర్మ ఓ బొమ్మ వేసుకునే ఛాన్సుంది. ఇంకా వర్మ దృష్టికి ఈ కామెంట్ల యుద్ధం వెళ్లినట్లు లేదు.. లేదంటేనే ఈ సరికే సోషల్ మీడియాలో ప్రకటన వచ్చేసేది.. చిన్నపాటి ప్రోమోలు కూడా మొదలయ్యేవి. అలా ఉంది ఇప్పుడు ఇండస్ట్రీలో సమంత-చిట్టిబాబు (Samantha vs Chittibabu)ల మధ్య మాటల యుద్ధం.

ఈ మధ్య సమంతపై చిట్టిబాబు అనే నిర్మాత చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలో.. సమంత గురించి తనకు అంతా తెలుసు అన్నట్లుగా ఆయన చేసే కామెంట్స్ సమంత అభిమానులకే కాదు, సమంత వరకు రీచ్ అయ్యాయి. ఇటీవల చిట్టిబాబు పేరు ప్రస్తావించకుండా సమంత కూడా చెవుల్లో జుట్టు ఉన్నోడు అంటూ కౌంటర్స్ సంధించినట్లుగా వార్తలు వచ్చాయి. ఏం తెలుసని మాట్లాడుతున్నారో తెలియకుండా కొందరు వాగుతున్నారనేలా సమంత కూడా సీరియస్ అయింది. సమంత తన ఇన్‌స్టాలో సదరు వ్యక్తి గురించి ఇలా ప్రస్తావించినట్లుగా వార్తలు వచ్చాయి. సమంత చేసిన ఈ కామెంట్ ఇప్పుడు చిట్టిబాబు దృష్టికి చేరడంతో.. ఆమె విషయంలో ఇప్పుడాయన ఇంకో అడుగు ముందుకు వేశాడు. (War Between Samantha and Chittibabu)

samantha-citadel.jpg

నేను కౌంటర్స్ మొదలుపెడితే.. సమంతకు తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కానంతగా ఇబ్బంది పడుతుందని అంటూ చిట్టిబాబు ఫైరయ్యాడు. ‘‘ఆమె ప్రత్యేకంగా నా పేరును ప్రస్తావించలేదు కాబట్టి.. నేను ఆమె పేరుతో సమాధానం ఇవ్వడం లేదు. కానీ, నేను గానీ కౌంటర్ మొదలెడితే ఆమె తట్టుకోలేదు. నా వెంట్రుకల గురించి మాట్లాడటం ఆపేసి.. నా కామెంట్లలో ఉన్న వాస్తవం గురించి ఆమె మాట్లాడితే బాగుండేది’’ అని చిట్టిబాబు తన తాజా ఇంటర్వ్యూలో సమంతకు చిన్నపాటి హెచ్చరికను జారీ చేశాడు. మరి ఈ వ్యాఖ్యలపై సమంత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. అయితే.. ఈ విషయమై అనవసరంగా అతడి గురించి మాట్లాడి.. మీడియాలో అతడిని హీరోని చేయవద్దంటూ సమంతకు ఫ్యాన్స్ రిక్వెస్ట్‌లు పెడుతుండటం విశేషం. సమంత విషయానికి వస్తే.. రీసెంట్‌గా ఆమె నటించిన ‘శాకుంతలం’ చిత్రం విడుదలైంది. సెట్స్‌పై ‘ఖుషి’ (Kushi), ‘సిటాడెల్’ (Citadel) అనే ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

************************************************

*Samantha: ఆంధ్రప్రదేశ్‌లో హీరోయిన్ సమంతకు గుడి.. ప్రారంభం ఎప్పుడంటే?

*Kushboo: క్యాండిల్‌ వెలుగులో మేకప్‌ వేసుకున్నాం

*Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ అస్సలు తగ్గట్లేదుగా..

*N Lingusamy: దర్శకుడు లింగుస్వామికి హైకోర్టులో ఊరట

*#HBDSamuthirakani: సముద్రఖనికి ‘PKSDT’ టీమ్ సర్‌ప్రైజ్

*Young Tiger NTR: అవకాశం వస్తే రెడీ... ఎన్టీఆర్ నటనకు హాలీవుడ్ దర్శకుడు ఫిదా!

*Director Teja: నువ్వేం పీకావ్.. అంటూ హీరో గోపీచంద్‌తో పబ్లిగ్గా గొడవకు దిగిన తేజ!

Updated Date - 2023-04-26T17:45:46+05:30 IST