Kushboo: క్యాండిల్‌ వెలుగులో మేకప్‌ వేసుకున్నాం

ABN , First Publish Date - 2023-04-26T15:53:13+05:30 IST

నేను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తల్లో బాత్రూమ్‌లో దుస్తులు మార్చుకున్నా. మేకప్‌ లేని సమయంలో ..

Kushboo: క్యాండిల్‌ వెలుగులో మేకప్‌ వేసుకున్నాం
Actress Kushboo

తాను సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో క్యాండిల్‌ వెలుగులో మేకప్‌ వేసుకున్నానని సినీ నటి ఖుష్బూ (Actress Kushboo) చెప్పారు. ఇప్పుడు చిత్రపరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందిందని తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ అనుభవాలు, కష్టాలను వివరించారు. ప్రస్తుతం ఖుష్బూ రాజకీయ నాయకురాలి (Political Leader)గా బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. అటు పాలిటిక్స్‌తో పాటు తన వద్దకు వచ్చిన మంచి పాత్రలలో నటించేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘రామబాణం’ (Rama Banam) చిత్రం మే 5న విడుదల కాబోతోంది. తాజాగా ఆమె సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.

‘‘నేను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తల్లో బాత్రూమ్‌లో దుస్తులు మార్చుకున్నా. మేకప్‌ లేని సమయంలో పసుపు వినియోగించే వాళ్ళం. ఇది ఆలయ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఎంతగానో ఉపయోగపడేది. ఇప్పుడు గ్రాఫిక్స్‌ అందుబాటులోకి వచ్చి అన్నీ మారిపోయాయి. నేను తెలుగు చిత్రాల్లో అధికంగా నటించకపోవడానికి తెలుగు చిత్రపరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్‌ కావడం. మా కుటుంబం ముంబై నుంచి చెన్నైకు మారాం. ఇక్కడి (చెన్నై) నుంచి హైదరాబాద్‌కు వెళ్ళలేక పోయాం. అందుకే తెలుగులో అధిక చిత్రాల్లో నటించలేకపోయాను’’ అని ఖుష్బూ (Kushboo) వివరించారు. ప్రస్తుతం ఆమె జాతీయ మహిళా సంఘం సభ్యురాలిగా ఉన్న విషయం తెల్సిందే.

Kushboo-Pic.jpg

ఇక ఆమె తెలుగులో నటించిన ‘రామబాణం’ చిత్రం విషయానికి వస్తే.. మ్యాచో హీరో గోపీచంద్ (Gopichand), శ్రీవాస్ (Sriwass) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) ఈ చిత్రాన్ని నిర్మించగా.. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) ఇందులో గోపీచంద్ బ్రదర్‌గా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ ప్రస్తుతం యమా జోరుగా సాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

************************************************

*Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ అస్సలు తగ్గట్లేదుగా..

*N Lingusamy: దర్శకుడు లింగుస్వామికి హైకోర్టులో ఊరట

*#HBDSamuthirakani: సముద్రఖనికి ‘PKSDT’ టీమ్ సర్‌ప్రైజ్

*Young Tiger NTR: అవకాశం వస్తే రెడీ... ఎన్టీఆర్ నటనకు హాలీవుడ్ దర్శకుడు ఫిదా!

*Director Teja: నువ్వేం పీకావ్.. అంటూ హీరో గోపీచంద్‌తో పబ్లిగ్గా గొడవకు దిగిన తేజ!

*Dimple Hayathi: నేను, శ్రీలీల.. ఇంకా నలుగురు రావాలి.. అప్పుడే సెలబ్రేషన్స్

*IT Raids: మైత్రీ పెట్టుబడులపై కీలక సమాచారం రాబట్టిన ఐటీ.. స్టార్ హీరో, దర్శకుడు అడ్డంగా బుక్కయినట్లేనా?

Updated Date - 2023-04-26T15:53:13+05:30 IST