Young Tiger NTR: అవకాశం వస్తే రెడీ... ఎన్టీఆర్ నటనకు హాలీవుడ్ దర్శకుడు ఫిదా!

ABN , First Publish Date - 2023-04-26T12:00:02+05:30 IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (Young Tiger NTR)తో అవకాశం వస్తే సినిమా చేయడానికి రెడీ అంటూ ఓ హాలీవుడ్ దర్శకుడు (Hollywood Director) ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. ఆ హాలీవుడ్ దర్శకుడు ఎవరని అనుకుంటున్నారా?

Young Tiger NTR: అవకాశం వస్తే రెడీ... ఎన్టీఆర్ నటనకు హాలీవుడ్ దర్శకుడు ఫిదా!
Young Tiger NTR

‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా విడుదలై చాలా కాలం అయింది. ఇటీవల ఆస్కార్ అవార్డు (Oscar Award) కూడా ఆ చిత్రాన్ని వరించింది. అయినా కూడా ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా, అందులో ప్రధాన పాత్రలలో నటించిన ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్‌ (Ram Charan)ల గురించి ఏదో రకంగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Mega Power Star Ram Charan)తో పని చేయాలని హాలీవుడ్ దర్శకులు కొందరు ఉత్సహాన్ని ప్రదర్శిస్తే.. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (Young Tiger NTR)తో అవకాశం వస్తే సినిమా చేయడానికి రెడీ అంటూ ఓ హాలీవుడ్ దర్శకుడు (Hollywood Director) ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. ఆ హాలీవుడ్ దర్శకుడు ఎవరని అనుకుంటున్నారా? ‘గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ’ (Guardians of the Galaxy) చిత్రాల దర్శకుడు జేమ్స్ గన్ (James Gunn).

ఇటీవల జరిగిన ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ నిమిత్తం అమెరికాలో సందడి చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అవకాశం వస్తే హాలీవుడ్ చిత్రాలలో చేయడానికి సిద్ధం అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఓ హాలీవుడ్ దర్శకుడు.. తన నటనకు ఫిదా అయ్యానని చెప్పడమే కాకుండా, అవకాశం వస్తే తప్పకుండా అతనితో సినిమా చేస్తానని ప్రకటించడం.. నిజంగా ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమకు (Tollywood) దక్కిన మరో గౌరవంగా అంతా భావిస్తున్నారు. ఎందుకంటే.. జేమ్స్ గన్ (Director James Gunn) అంటే సాదారణమైన దర్శకుడు కాదు. తాజాకు ఆయనకు మీరు రూపొందిస్తున్న ‘గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ’ యూనివర్స్‌లోకి ఇండియన్ నటులులో ఎవరినైనా తీసుకోవాల్సి వస్తే.. అనే ప్రశ్న ఎదురైంది.

NTR.jpg

ఈ ప్రశ్నకు ‘గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ’ దర్శకుడు సమాధానమిస్తూ.. ‘ఆర్ఆర్ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటన నాకు బాగా నచ్చింది. అందులో క్రూర మృగాలతో ఎన్టీఆర్ ఓ వ్యాన్‌లో నుంచి ఎంటరయ్యే సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అవకాశం వస్తే మాత్రం అతనితో పనిచేయాలని ఉందంటూ చెప్పుకొచ్చారు. దీంతో నందమూరి అభిమానుల (Nandamuri Fans) ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి జేమ్స్ గన్ చెబుతున్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ‘NTR30’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే డైరెక్ట్ హిందీ చిత్రం ‘వార్ 2’ (War 2)లో ఎన్టీఆర్ నటించనున్నారు. అన్నీ బాగుంటే.. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. పాన్ వరల్డ్ (Pan World) రేంజ్‌లో డైరెక్ట్ హాలీవుడ్ చిత్రం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Director Teja: నువ్వేం పీకావ్.. అంటూ హీరో గోపీచంద్‌తో పబ్లిగ్గా గొడవకు దిగిన తేజ!

*Dimple Hayathi: నేను, శ్రీలీల.. ఇంకా నలుగురు రావాలి.. అప్పుడే సెలబ్రేషన్స్

*IT Raids: మైత్రీ పెట్టుబడులపై కీలక సమాచారం రాబట్టిన ఐటీ.. స్టార్ హీరో, దర్శకుడు అడ్డంగా బుక్కయినట్లేనా?

*Amala Paul: కథ డిమాండ్‌ చేస్తే.. నగ్నంగా నటించేందుకు ఎలాంటి బెరుకు లేదు

*Virupaksha Director: సాయితేజ్‌కి బైక్‌ యాక్సిడెంట్‌ అయినప్పుడు.. కార్తీక్ పరిస్థితి ఏంటంటే..

*Pawan Kalyan: మైత్రీ మూవీ మేకర్స్‌పై ఐటీ దాడి.. పవన్ ప్రకటనకు అర్థమేంటి?

Updated Date - 2023-04-26T12:23:45+05:30 IST