Samantha: ఆంధ్రప్రదేశ్‌లో హీరోయిన్ సమంతకు గుడి.. ప్రారంభం ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-04-26T16:46:29+05:30 IST

నటీమణులు ఖుష్బూ (Kushboo), హన్సిక (Hansika), నమిత (Namitha), నిధి అగర్వాల్ (Niddhi Agarwal) వంటి వారికి తమిళ తంబీలు గుడికట్టి (Temple) ఆరాధించారు. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ అభిమాని

Samantha: ఆంధ్రప్రదేశ్‌లో హీరోయిన్ సమంతకు గుడి.. ప్రారంభం ఎప్పుడంటే?
Temple for Samantha

తెలుగు ఆడియన్స్ కూడా తమిళ ఆడియన్స్‌లా.. అభిమానించే వారి కోసం గుడి కట్టే సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. ఇప్పటి వరకు కోలీవుడ్‌లో ఈ గుడి కట్టే సాంప్రదాయం ఉంది. నటీమణులు ఖుష్బూ (Kushboo), హన్సిక (Hansika), నమిత (Namitha), నిధి అగర్వాల్ (Niddhi Agarwal) వంటి వారికి తమిళ తంబీలు గుడికట్టి (Temple) ఆరాధించారు. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ అభిమాని.. తనకు నచ్చిన హీరోయిన్‌కు గుడి కట్టేసి.. త్వరలో ప్రారంభించబోతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌కి (Andhra Pradesh) చెందిన ఓ డై హార్డ్ ఫ్యాన్ (Die Hard Fan) హీరోయిన్ సమంత (Samantha)కు గుడి కట్టిన వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో సమంతకు గుడి ఏమిటి? అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.

విషయంలోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా, చుండూరు మండలంలోని ఆలపాడు (Alapadu) గ్రామానికి చెందిన తెనాలి సందీప్ (Tenali Sundeep) అనే వ్యక్తి సమంతకు గుడి కట్టించారు. స్టార్ హీరోయిన్ సమంతకు వీరాభిమాని (Samantha Fan) అయినటువంటి సందీప్.. ఆమె నటనకి, అలాగే ప్రత్యూష ఫౌండేషన్ (Pratyusha Foundation) ద్వారా ఆమె చేసే సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడయ్యాడు. అంతే ఆమె కోసం ఏదైనా చేయాలని ఆలోచించిన సందీప్.. అలపాడులోని తన ఇంటి ప్రాంగణంలోనే సమంతకు గుడి కట్టే (Samantha Temple) కార్యక్రమానికి పూనుకున్నాడు. ఆయన తలపెట్టిన ఈ కార్యక్రమం ఎంత వరకు వచ్చిందంటే.. ప్రస్తుతం సమంత విగ్రహం, గుడి చివరి దశలో ఉన్నాయి. ఈ నెల 28న ఎట్టి పరిస్థితుల్లోనూ సమంత గుడిని ప్రారంభించాలనే పట్టుదలతో సందీప్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

Samantha-Statue.jpg

హీరోయిన్ సమంత (Heroine Samantha) అంటే ఎందుకంత అభిమానం అని అడిగితే.. నటిగా మాత్రమే సమంత అందరికీ తెలుసు. కానీ ఆమె ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఇంకా వృద్దులను ఆదుకుంటున్నారు. తనకి అవసరం లేకపోయినా.. అనారోగ్యం పాలైన వారందరికీ తన ఫౌండేషన్ ద్వారా పునర్జన్మ ప్రసాదిస్తున్న సమంతకు గుడి కట్టాలని (Temple for Samantha) ఫిక్స్ అయ్యాను. ఆమెను నేరుగా నేను ఇప్పటి వరకు కలవలేదు కానీ.. ఆమెపై ఉన్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నానని తెలుపుతున్నాడీ వీరాభిమాని. అయితే.. ఈ గుడి ఓపెనింగ్‌ని సందీప్ ఎవరితో చేయిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి:

************************************************

*Kushboo: క్యాండిల్‌ వెలుగులో మేకప్‌ వేసుకున్నాం

*Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ అస్సలు తగ్గట్లేదుగా..

*N Lingusamy: దర్శకుడు లింగుస్వామికి హైకోర్టులో ఊరట

*#HBDSamuthirakani: సముద్రఖనికి ‘PKSDT’ టీమ్ సర్‌ప్రైజ్

*Young Tiger NTR: అవకాశం వస్తే రెడీ... ఎన్టీఆర్ నటనకు హాలీవుడ్ దర్శకుడు ఫిదా!

*Director Teja: నువ్వేం పీకావ్.. అంటూ హీరో గోపీచంద్‌తో పబ్లిగ్గా గొడవకు దిగిన తేజ!

Updated Date - 2023-04-26T16:46:29+05:30 IST