Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ అస్సలు తగ్గట్లేదుగా..

ABN , First Publish Date - 2023-04-26T14:22:32+05:30 IST

‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమాకు సంబంధించి ఎనిమిది రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌లో హరీష్ శంకర్ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ అస్సలు తగ్గట్లేదుగా..
Ustaad Bhagat Singh Still

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan), బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) చిత్ర ఎటువంటి సంచనాలను సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) పేరుతో మరో చిత్రం రెడీ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఈ చిత్రంలో ఫేమస్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ప్రధాన తారాగణం, ఇతర ముఖ్య నటీనటులపై తెరకెక్కించిన కీలక సన్నివేశాలతో మొదటి షెడ్యూల్ ముగిసింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ మరో దర్శకుడు సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఓజీ’ (OG) షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించి తాజాగా మేకర్స్ ఓ అప్‌డేట్‌ని విడుదల చేశారు. ఈ చిత్ర ఎడిటింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టినట్లుగా తెలుపుతూ.. ఎడిటింగ్ రూమ్‌లో జరిగిన పూజా కార్యక్రమాల ఫొటోలను షేర్ చేశారు.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమాకు సంబంధించి ఎనిమిది రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌లో హరీష్ శంకర్ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ (Ram-Lakshman) పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు. మరియు పలువురు పిల్లలతో వినోదభరితమైన సన్నివేశాలు తెరకెక్కించారు. అలాగే రొమాంటిక్ సన్నివేశాలను, భారీగా రూపొందించిన పోలీస్ స్టేషన్ సెట్‌లో మరికొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. హీరోయిన్ శ్రీలీలతో పాటు నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి పలువురు నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. మొదటి షెడ్యూల్‌లో చిత్రీకరించిన సన్నివేశాల పట్ల చిత్ర బృందం ఎంతో సంతృప్తిగా ఉంది. రెండో షెడ్యూల్ ప్రారంభం అయ్యే లోపు.. మొదటి షెడ్యూల్‌లో చిత్రీకరించిన సన్నివేశాలన్నింటిని ఎడిటింగ్ (Editing) చేసి రెడీగా పెట్టుకుంటే.. చిత్రీకరణ అనంతరం ఎడిటింగ్ కోసం ప్రత్యేక సమయం కేటాయించే పని ఉండదని భావించిన మేకర్స్.. ఇలా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

Bhagat-Singh.jpg

కాగా.. ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఇప్పటికే విడుదలైన పవన్ కల్యాణ్ స్టైలిష్ పోస్టర్లు అభిమానులను అమితంగా ఆకర్షించగా.. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలతో నిండిన కథతో ఈ చిత్రం భారీస్థాయిలో రూపొందిస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి మెమరబుల్ ఆల్బమ్‌‌ని అందించిన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (Music Director Devi Sri Prasad), మరో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు మరియు తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*N Lingusamy: దర్శకుడు లింగుస్వామికి హైకోర్టులో ఊరట

*#HBDSamuthirakani: సముద్రఖనికి ‘PKSDT’ టీమ్ సర్‌ప్రైజ్

*Young Tiger NTR: అవకాశం వస్తే రెడీ... ఎన్టీఆర్ నటనకు హాలీవుడ్ దర్శకుడు ఫిదా!

*Director Teja: నువ్వేం పీకావ్.. అంటూ హీరో గోపీచంద్‌తో పబ్లిగ్గా గొడవకు దిగిన తేజ!

*Dimple Hayathi: నేను, శ్రీలీల.. ఇంకా నలుగురు రావాలి.. అప్పుడే సెలబ్రేషన్స్

*IT Raids: మైత్రీ పెట్టుబడులపై కీలక సమాచారం రాబట్టిన ఐటీ.. స్టార్ హీరో, దర్శకుడు అడ్డంగా బుక్కయినట్లేనా?

Updated Date - 2023-04-26T14:22:32+05:30 IST