Director Teja: నువ్వేం పీకావ్.. అంటూ హీరో గోపీచంద్‌తో పబ్లిగ్గా గొడవకు దిగిన తేజ!

ABN , First Publish Date - 2023-04-26T11:17:39+05:30 IST

గోపీచంద్‌కి లైఫ్ ఇచ్చిన దర్శకులలో తేజ ప్రథమ స్థానంలో ఉంటాడు. అది ఎవరూ కాదనలేని నిజం. అలాంటి దర్శకుడితో సినిమా ఓకే చేసి.. హీరోయిన్ సెట్ కాలేదని.. వేరే సినిమా చేయడం

Director Teja: నువ్వేం పీకావ్.. అంటూ హీరో గోపీచంద్‌తో పబ్లిగ్గా గొడవకు దిగిన తేజ!
Gopichand and Director Teja

‘లక్ష్యం’, ‘లౌక్యం’ తర్వాత శ్రీవాస్ (Sriwass) దర్శకత్వంలో మ్యాచో హీరో గోపీచంద్ (Gopichand) చేస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘రామబాణం’ (Rama Banam). ఈ సినిమా మే 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ని యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా హీరో గోపీచంద్‌ను.. సీనియర్ దర్శకుడు తేజ (Director Teja) ఓ ఇంటర్వ్యూ చేశారు. ఇది ఇంటర్వ్యూ అనే కంటే.. వారిద్దరి మధ్య జరిగిన గొడవగా చెబితే బాగుంటుంది. ఎందుకంటే.. గోపీచంద్‌ ముందు తేజ అలాంటి ప్రశ్నలను సంధించారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రోమోలో..

* ‘రామబాణం’ టైటిల్‌ని బాలకృష్ణ (Balakrishna)తో ఎందుకు అనౌన్స్ చేయించారు?

* మీకు బాగా నచ్చిన సినిమా ఏది?

* శ్రీవాస్‌తో మూడో సినిమా చేస్తున్నావ్.. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మాకు వచ్చిన టాక్.. నీకు, డైరెక్టర్‌కి మధ్య గొడవ జరిగిందట?

* నీకో కథ చెప్పా.. ఓకే అన్నావ్. హీరోయిన్ సెట్ కాలేదు. హీరోయిన్‌ని సెట్ చేసే పనిలో ఉండగా.. సడెన్‌గా నువ్వు ఇంకో సినిమా స్టార్ట్ చేశావ్. నేను ఫోన్ చేస్తే నువ్వసలు లిఫ్ట్ కూడా చేయలేదు. తేజ కంటే ఈ డైరెక్టర్ బెటర్. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకూడదు. ఫోన్ తీసి పక్కన పడేద్దాం.. అంతేనా?

* మీ నాన్న టి. కృష్ణగారు చేసిన మంచి వల్ల ‘జయం’ (Jayam)లో నీకు ఆ అవకాశం వచ్చింది. నా ఉద్దేశ్యంలో ఇప్పటి వరకు నీకు అదే ఫౌండేషనా?

* మీ నాన్న గొప్పోడు ఓకే.. మరి నువ్వేం పీకావ్?.. అంటూ తేజ.. గోపీచంద్‌కి ప్రశ్నలు సంధించారు. తేజ ఇన్ని ప్రశ్నలు అడిగితే.. గోపీచంద్ మాత్రం.. మరి మీరెందుకు సినిమాలకు ఇంత గ్యాప్ ఇస్తున్నారు? అని తేజాని ప్రశ్నించారు.

దీనికి తేజ.. ‘నా అంతట నేను వెళ్లి ఎవడినీ సినిమా చేయమని అడగను’ అంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పూర్తి ఇంటర్వ్యూని మేకర్స్ బుధవారం విడుదల చేయనున్నారు. (Teja and Gopichand Interview)

అయితే ఈ ప్రోమో చూసిన వారంతా.. ఇది ఇంటర్వ్యూలా లేదు.. వారిద్దరి మధ్య గొడవలా ఉందంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఎందుకంటే గోపీచంద్‌కి లైఫ్ ఇచ్చిన దర్శకులలో తేజ ప్రథమ స్థానంలో ఉంటాడు. అది ఎవరూ కాదనలేని నిజం. అలాంటి దర్శకుడితో సినిమా ఓకే చేసి.. హీరోయిన్ సెట్ కాలేదని.. వేరే సినిమా చేయడం కరెక్ట్ కాదు కదా. అలాగే.. ఎంత లైఫ్ ఇచ్చినా.. ఎప్పుడు మొదలవుతుందో తెలియని సినిమా కోసం అలాగే కూర్చుని ఉండటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి గోపీచంద్ చేసింది మంచి పనే అని చెప్పుకోవచ్చు. కానీ తేజ ఈ విషయాన్ని పబ్లిక్‌గా అడగడంతో గోపీచంద్ ఫ్యాన్స్ హర్టవుతున్నారు. ఈ విషయంలో తేజకి గోపీచంద్ సారీ కూడా చెప్పారు. అది కూడా ఈ ప్రోమోలో ఉంది. మొత్తంగా ‘రామబాణం’ పబ్లిసిటీ (Rama Banam Publicity) కోసం మేకర్స్ ‘తేజా బాణం’ (Teja Banam) బాగానే వదిలారనేలా ఈ వీడియోకు కామెంట్స్ పడుతున్నాయ్.


ఇవి కూడా చదవండి:

************************************************

*Dimple Hayathi: నేను, శ్రీలీల.. ఇంకా నలుగురు రావాలి.. అప్పుడే సెలబ్రేషన్స్

*IT Raids: మైత్రీ పెట్టుబడులపై కీలక సమాచారం రాబట్టిన ఐటీ.. స్టార్ హీరో, దర్శకుడు అడ్డంగా బుక్కయినట్లేనా?

*Amala Paul: కథ డిమాండ్‌ చేస్తే.. నగ్నంగా నటించేందుకు ఎలాంటి బెరుకు లేదు

*Virupaksha Director: సాయితేజ్‌కి బైక్‌ యాక్సిడెంట్‌ అయినప్పుడు.. కార్తీక్ పరిస్థితి ఏంటంటే..

*Pawan Kalyan: మైత్రీ మూవీ మేకర్స్‌పై ఐటీ దాడి.. పవన్ ప్రకటనకు అర్థమేంటి?

*Sai Dharam Tej: కోహ్లీ-పవన్, ధోని-చరణ్.. అల్లు అర్జున్‌ని అతడితో పోల్చాడేంటి?

*Upasana: అత్యంత ప్రేమాభిమానాల మధ్య ఉపాసన సీమంతం.. ఫొటోలు వైరల్

Updated Date - 2023-04-26T11:17:39+05:30 IST