సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijay Anthony: ‘బిచ్చగాడు 2’ తర్వాత పవర్‌ఫుల్‌ టైటిల్‌తో..

ABN, First Publish Date - 2023-06-13T17:08:28+05:30

‘బిచ్చగాడు 2’ తర్వాత విజయ్ ఆంటోనీ హీరోగా చేసే చిత్రానికి పవర్‌ఫుల్ టైటిల్‌ని ఫిక్స్ చేశారు. అపోలో ప్రొడక్షన్స్, SNS మూవీస్ సంయుక్త సమర్పణలో.. బాబు యోగేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘విక్రమ్ రాథోడ్’ అనే టైటిల్‌ని ఖరారు చేయడంతో పాటు.. చిత్ర ఫస్ట్ ‌లుక్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. ఓం శివ గంగ ఎంటర్‌‌ప్రైజెస్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది.

Vijay Antony
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగీత దర్శకునిగా ప్రయాణం ప్రారంభించి.. ఆ తర్వాత నటుడిగా వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ.. తన టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు తమిళ నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Anthony). తన విలక్షణ నటనతో, టాలెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్న విజయ్ ఆంటోనీ.. ఇటీవలే ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2) అంటూ వచ్చి మంచి సక్సెస్ కొట్టారు. అదే జోష్‌లో ఇప్పుడాయన మరో డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘బిచ్చగాడు 2’ తర్వాత విజయ్ ఆంటోనీ హీరోగా చేసే చిత్రానికి ‘విక్రమ్ రాథోడ్’ (Vikram Rathod) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ని ఫిక్స్ చేశారు.

తాజాగా ‘విక్రమ్ రాథోడ్’ టైటిల్‌తో పాటు మేకర్స్ చిత్ర ఫస్ట్ లుక్‌ (Vikram Rathod First Look)ని కూడా విడుదల చేశారు. అపోలో ప్రొడక్షన్స్, SNS మూవీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు బాబు యోగేశ్వరన్ (Babu Yogeswaran) దర్శకత్వం వహిస్తున్నారు. రావూరి వెంకటస్వామి, S కౌసల్య రాణి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా (Maestro Ilayaraja) సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కూడా ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ముఖంపై గాయాలతో కనిపిస్తున్నారు విజయ్ ఆంటోనీ. సీరియస్ లుక్‌లో ఆయన కనిపిస్తుండగా.. ఎవరో పిస్తోల్‌ ఆయనకు గురిపెట్టి.. భయపెట్టాలని చూస్తున్నారు. విజయ్ ఆంటోని మాత్రం రెప్ప కూడా వాల్చకుండా.. దమ్ముంటే కాల్చు అన్నట్లుగా చూస్తున్నారు. ఈ పోస్టర్‌లో ఆయన లుక్ చూస్తుంటే.. మరో డిఫరెంట్ ఫిల్మ్‌తో విజయ్ ఆంటోనీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అర్థమవుతోంది. కాగా.. ఓం శివ గంగ ఎంటర్‌‌ప్రైజెస్ (Om Shiva Ganga Enterprises) సంస్థ (K బాబు రావు) సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయబోతోంది. సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోను సూద్, సంగీత ముఖ్య పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Manoj Bajpayee: పవన్ కల్యాణ్ ఆల్రెడీ చేశారు.. మహేష్ బాబు అయితే బెటర్!

**************************************

*Ravi Teja: పెయింటరా? లేక పత్తి పండించే రైతా?.. మాస్ రాజా ఖాతాలో మరొకటి!

**************************************

*Ileana: నా కన్నీళ్లు తుడిచాడు.. తన ప్రియుడిపై ఇలియానా ఆసక్తికరమైన వ్యాఖ్యలు

*********************************

*Gopichand: ‘రామబాణం’ తర్వాత మరో పవర్‌ఫుల్ టైటిల్‌తో.. ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల

******************************

*Sreeleela: నిర్మాతలకు ‘నో’ చెబుతున్న శ్రీలీల

***************************

*Samantha: క్లబ్‌లో బీర్ కొడుతూ.. ‘ఊ అంటావా మావ’ పాటకి నాటు నాటు స్టెప్స్.. వీడియో వైరల్


********************************

*VarunLav: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ ఫొటోలు

*******************

*Sharwa-Rakshita: శర్వానంద్, రక్షితల వెడ్డింగ్ రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి

*********************************

Updated Date - 2023-06-13T17:08:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!