సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Adipurush: తిరుపతికి ‘ఆదిపురుష్’ ఆగమనం.. ఎప్పుడంటే?

ABN, First Publish Date - 2023-05-24T19:57:04+05:30

పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ప్రీ రిలీజ్ వేడుకను శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుపతి క్షేత్రంలో అత్యంత వైభవంగా జరపబోతున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు.

Adipurush Movie Still
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్‌’ (Adipurush). బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రామాయణ ఇతిహాసంలోని ఓ ఘట్టంగా తెరకెక్కించారు. ప్రభాస్ (Prabhas) రాఘవుడుగా, కృతి సనన్ (Kriti Sanaon) సీతగా నటించిన ఈ చిత్రంలో సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) రావణుడు పాత్రల్లో నటించారు. రీసెంట్‌గా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఓ గొప్ప కథను అద్భుతమైన విజువల్స్‌తో వెండితెరపై చూడబోతున్నాం అనే ఆసక్తిని అందరిలోనూ క్రియేట్ చేసింది ‘ఆదిపురుష్‌’ ట్రైలర్ (Adipurush Trailer). ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల్లో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.

చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఆదిపురుష్‌ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. జూన్ 6న తిరుపతి (Tirupati)లో అత్యంత వైభవంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా మరికొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరగనున్నా .. శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుపతి క్షేత్రంలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Adipurush Pre Release Event) జరగడం చారిత్రాత్మకంగా చెప్పవచ్చు. సో.. ‘ఆదిపురుష్’ తిరుపతి ఆగమనానికి డేట్ ఫిక్సయిపోయింది. ఇందుకోసం ఇప్పటి నుంచే యూనిట్ ఏర్పాట్లు మొదలెట్టినట్లుగా తెలుస్తోంది.

వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు అంతా నిరాశకు లోనయ్యారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ (Prabhas Fans) అయితే.. ఇదేం సినిమా అంటూ రజనీకాంత్ ‘విక్రమ్ సింహా’ (Rajinikanth Vikram Simha)తో పోలుస్తూ.. దర్శకుడిని ట్రోల్ చేశారు. ఆ తర్వాత దర్శకుడు దిద్దుబాటు చర్యల కోసం టైమ్ తీసుకున్నారు. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌తో అంతా హ్యాపీగా ఉండటంతో.. సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాపై పాన్ వరల్డ్ స్థాయిలో భారీగానే అంచనాలు నెలకొని ఉన్నాయి. (Adipurush Pre Release Event Update)

ఇవి కూడా చదవండి:

************************************************

*TholiPrema Re Release: సపోర్ట్ చేసేదే లేదంటోన్న మెగా ఫ్యాన్స్.. కారణం ఏంటంటే?

*Virinchi Varma: కామ్‌గా షూటింగ్ మొదలెట్టేసిన దర్శకుడు

*Tiger Nageswara Rao Glimpse: పులుల్ని వేటాడే పులిని చూశారా? అయితే చూడండి..

*Nene Raju Nene Mantri: జోగేంద్ర పాత్రను మించేలా.. కాంబినేషన్ రిపీట్!

*Hansika: టాలీవుడ్ హీరో వేధించాడంటూ వార్తలు.. హన్సిక ఎలా రియాక్ట్ అయిందంటే?

Updated Date - 2023-05-24T19:57:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!