Aakasam Dhaati Vasthaava: కొరియోగ్రాఫర్ యశ్ మాస్టర్ లవ్ స్టోరీ చాలా ఫ్రెష్‌గా ఉంది

ABN , First Publish Date - 2023-08-05T18:05:56+05:30 IST

కొరియోగ్రాఫ‌ర్ య‌ష్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. కార్తీక ముర‌ళీధ‌ర‌న్ హీరోయిన్. శశి కుమార్ ముతులూరి ద‌ర్శ‌కత్వంలో హ‌ర్షిత్‌, హ‌న్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు దర్శకనిర్మాతలు. ఈ టీజర్ కొత్తదనం నిండిని ఫ్రెష్ ఫీల్‌ని ఇస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్‌ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Aakasam Dhaati Vasthaava: కొరియోగ్రాఫర్ యశ్ మాస్టర్ లవ్ స్టోరీ చాలా ఫ్రెష్‌గా ఉంది
Yash in Aakasam Dhaati Vasthaava

నిర్మాత శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ (Dil Raju Productions) బ్యాన‌ర్ నుంచి ప్రొడ‌క్ష‌న్ నెం.2గా రూపొందుతోన్న సినిమా ‘ఆకాశం దాటి వ‌స్తావా’ (Aakasam Dhaati Vasthaava). కొరియోగ్రాఫ‌ర్ య‌శ్ (Yash) ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. కార్తీక ముర‌ళీధ‌ర‌న్ (Karthika Muralidharan) హీరోయిన్. శశి కుమార్ ముతులూరి (Sasi Kumar M) ద‌ర్శ‌కత్వంలో హ‌ర్షిత్‌, హ‌న్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు నిర్మాతలు. 72 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూడబోతోన్నట్టుగా అనిపించింది.


Yash-2.jpg

‘ఓయ్ బాయ్ ఫ్రెండ్ మెటీరియల్.. ఎప్పుడూ ఇదే పనా? బోర్ కొట్టదా?’ అంటూ హీరోయిన్ మాట్లాడే మాటలు.. ‘ఎప్పుడూ ఇంతే అందంగా ఉంటావ్.. నీకు బోర్ కొట్టదా?’ అంటూ హీరో చెప్పే సమాధానంతో టీజర్ మొదలైంది. ‘ఎన్ని సార్లు వస్తావ్ ఇలా?’ అని హీరోయిన్ అనడం.. ‘ఎన్ని సార్లైనా వస్తాను’ అని హీరో అనడం.. ‘ఎంత దూరమైనా వస్తావా?’ అని హీరోయిన్.. ‘అడిగి చూడు’ అని హీరో.. ‘అబ్బో అడినంత మాత్రానా సముద్రాలు దాటి, ఆకాశం దాటి వస్తావా?’ అంటూ హీరోయిన్.. ‘అంత బడ్జెట్ ఉన్న ప్రేమ కాదు’ అని హీరో చెప్పడం వంటి సంభాషణలతో ఈ టీజర్ సరికొత్త ఫ్రెష్ ఫీల్‌ని ఇస్తోంది. (Aakasam Dhaati Vasthaava Teaser Talk)

Yash-1.jpg

ఈ టీజర్ ద్వారా సరికొత్త ప్రేమ కథను చూపించబోతోన్నట్టుగా అయితే దర్శక నిర్మాతలు చెప్పకనే చెప్పేశారు. ఈ టీజర్‌లో ర్యాంపీ నందిగాం అందించిన విజువల్స్, సింగర్ కార్తీక్ ఇచ్చిన మ్యూజిక్, యశ్ మరియు కార్తీక ముర‌ళీధ‌ర‌న్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. మొత్తానికి టీజర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు. ‘బలగం’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి వస్తోన్న రెండో చిత్రమిది. కొత్త టీంతో ఈ సారి మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. హీరో యశ్, హీరోయిన్ కార్తీక ముర‌ళీధ‌ర‌న్‌లు కొత్త వారే. ఈ సినిమాతో సింగర్ కార్తిక్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*Samantha: రూ. 25 కోట్లా? నేనూ వర్క్ చేశా.. అందుకు రాళ్లూరప్పలేం ఇవ్వలేదు

***************************************

*Bro: ఫ్యామిలీ ఆడియన్స్‌‌ కనెక్ట్ అయ్యారు.. ఈ వారం కూడా ‘బ్రో’దే బ్రో!


***************************************

*Dayaa: డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ‘దయా’ దండయాత్ర మొదలైంది

***************************************

*Kangana Ranaut: ‘చంద్రముఖి 2’లో కంగనా రనౌత్ లుక్ వచ్చేసింది

**************************************

*Sai Dharam Tej: మీ భద్రత నా బాధ్యత.. మీరలా చేస్తుంటే మనస్థాపం చెందుతున్నా..

**************************************

Updated Date - 2023-08-05T18:05:56+05:30 IST