Fateh: సోనూ సూద్ హీరోగా.. షూటింగ్ మొదలైంది.

ABN , First Publish Date - 2023-03-11T16:27:30+05:30 IST

కరోనా టైమ్‌లోనే కాకుండా ఆదుకోవాలని తన దగ్గరకు వచ్చిన వారికి.. లేదూ అనకుండా దానం చేసే గొప్ప మనసుకు వ్యక్తి సోనూసూద్ (Sonu Sood). తెలుగు ప్రేక్షకులకు విలన్‌గా పరిచయమే కానీ.. ఆయన్ని విలన్‌గా చూపిస్తే..

Fateh: సోనూ సూద్ హీరోగా.. షూటింగ్ మొదలైంది.
Sonu Sood Fateh Shooting Update

కరోనా టైమ్‌లోనే కాకుండా ఆదుకోవాలని తన దగ్గరకు వచ్చిన వారికి.. లేదూ అనకుండా దానం చేసే గొప్ప మనసుకు వ్యక్తి సోనూసూద్ (Sonu Sood). తెలుగు ప్రేక్షకులకు విలన్‌గా పరిచయమే కానీ.. ఆయన్ని విలన్‌గా చూపిస్తే.. ఇప్పుడు సినిమాలు కూడా ఆడటం లేదు. అంతగా ఆయన రియల్ హీరోగా మారిపోయాడు. అందుకేనేమో.. ఇప్పుడు హీరోగా మారుతున్నాడు. ZEE స్టూడియోస్ సమర్పణలో సోనూసూద్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) జంటగా వైభవ్ మిశ్రా (Vaibhav Mishra) దర్శకత్వంలో శాంతి సాగర్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న సైబర్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఫతే’ (Fateh). ఈ చిత్రం పంజాబ్‌లోని పవిత్ర నగరమైన అమృత్‌సర్‌ (Amritsar)లో గ్రాండ్‌గా ప్రారంభం జరుపుకుంది. చిత్రీకరణ సమయంలో సెట్స్‌లో ఎథికల్ హ్యాకర్లచే శిక్షణ పొందడానికి సోనూ సూద్ మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వివిధ వర్క్‌షాప్‌లలో పాల్గొన్నారు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైనట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా హీరో సోనూ సూద్ (Hero Sonu Sood) మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ (Cybercrime) నేపథ్యంలో ఈ ‘ఫతే’ చిత్రం ఉంటుంది. వాస్తవికతకు దగ్గరగా ఉండేలా ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొంది ఈ సినిమా స్ర్కిప్ట్ తయారు చేశారని తెలిపారు. హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. దర్శకుడు వైభవ్ మిశ్రా చెప్పిన కథ నచ్చడంతో తనిచ్చిన ఈ స్క్రిప్టు చదివాను. చదివినప్పటి నుండి, ఇలాంటి మంచి చిత్రంలో నటించాలనే ఇంట్రెస్ట్ కలిగింది. మేము చేస్తున్న ఈ ఫతే సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు. (Fateh begins shoot in Punjab)

నిర్మాతలు మాట్లాడుతూ.. దేశంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో సోనూ సూద్ ఒకరు.. అలాంటి వ్యక్తితో మేము ఈ సినిమా నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కచ్చితంగా ప్రేకకాదరణ పొందుతుంది. ఈ సినిమాకు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు. శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరిపి.. ఈ సంవత్సరం చివరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. (Sonu Sood Fateh Movie Update)

ఇవి కూడా చదవండి:

*********************************

* Harish Shankar: పెరుగన్నం, బిర్యానీ.. దర్శకుడు మహాకు కౌంటర్

*Pavitra Naresh: బ్యాచ్‌లర్స్ ఫీల్ కాకండి.. ఈ మీమ్స్ ఏంటి సామి?

*Ram Charan: మా నాన్న పెంపకం అలాంటిది.. ఆసక్తికర విషయాలు చెప్పిన చరణ్

*Radha Nair: తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో.. మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమో?

*Nagababu: ‘ఆర్ఆర్ఆర్’ మీద కామెంట్‌కు వైసీపీ వారి భాషలో సమాధానం

*Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సైడ్ యాక్టరా? ఇలా అవమానించారేంటి?

*Lakshmi Manchu: రక్తం మరిగిపోతోంది.. మంచు లక్ష్మికి కోపం తెప్పించిన వైరల్ వీడియో..

*Star Producer: పాపం.. దీన స్థితిలో స్టార్ నిర్మాత.. ఆదుకున్న స్టార్ హీరో

*Poonam Kaur: మళ్లీ చెబుతున్నా అర్థం చేసుకోండి.. వేదికపైనే కంటతడి పెట్టిన పూనమ్ కౌర్..

Updated Date - 2023-03-11T16:27:32+05:30 IST