సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Siddharth Anand: షారూఖ్ ఖాన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్

ABN, First Publish Date - 2023-03-11T20:48:30+05:30

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఐదేళ్ల తర్వాత సినిమా చేశారు. ‘పఠాన్’ (Pathaan) లో నటించారు. సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఐదేళ్ల తర్వాత సినిమా చేశారు. ‘పఠాన్’ (Pathaan) లో నటించారు. సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ.1000కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. సిద్దార్థ్ ఆనంద్ తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘పఠాన్’ లోని డిలెటెడ్ సీన్స్‌ను ఓటీటీ వెర్షన్‌కు జత చేస్తామని తెలిపారు.

‘పఠాన్’ లో మతానికి సంబంధించిన ఓ సన్నివేశం ఉంది. అందువల్ల మేకర్స్ ఈ సీన్‌ను కత్తిరించేశారు. సినిమాలో షారూఖ్‌కు ఏ మతంపై నమ్మకం ఉండదు. అందుకు కారణం ఏంటి అనేదే ఆ సీన్. ఆ సన్నివేశాన్నే మేకర్స్ ఓటీటీలో జత చేయబోతున్నారు. ‘పఠాన్’ లో దీపికా పదుకొణె (Deepika Padukone) హీరోయిన్‌గా నటించారు. జాన్ అబ్రహం కీలక పాత్రను పోషించారు. యశ్‌రాజ్‌ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నేపథ్యంలో సినిమాను రూపొందించింది. ‘జీరో’ (Zero) తర్వాత కింగ్ ఖాన్ సినీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తుండంతో ఈ మూవీపై విడుదలకు ముందే భారీ బజ్ ఉంది. ఆ అంచనాలను మించి ఈ చిత్రం రాణించింది.

‘పఠాన్’ ఇచ్చిన జోష్‌తో సిద్దార్థ్ ఆనంద్ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ‘ఫైటర్’ ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె హీరో, హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్టు తర్వాత ప్రభాస్ సినిమా పట్టాలెక్కనుందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: ఒక్క రోజుకు రూ.3కోట్ల రెమ్యునరేషన్!

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-11T20:56:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!