Shah Rukh Khan: లగ్జరీ కారు కొన్న హీరో.. ధర వింటే షాకే..

ABN , First Publish Date - 2023-03-27T15:51:13+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). దాదాపుగా నాలుగేళ్ల తర్వాత సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ‘పఠాన్’ (Pathaan) తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

Shah Rukh Khan: లగ్జరీ కారు కొన్న హీరో.. ధర వింటే షాకే..

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). దాదాపుగా నాలుగేళ్ల తర్వాత సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ‘పఠాన్’ (Pathaan) తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా లాభాల్లోను షారూఖ్‌కు వాటా ఉండటంతో భారీగా అర్జించారు. కింగ్ ఖాన్ తాజాగా ఓ విలాసవంతమైన కారును కొనుగోలు చేశారు. రోల్స్ రాయిస్ కలినన్ బ్లాక్ బ్యాడ్జ్ కారుకు తన గ్యారేజీలో చోటిచ్చారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హీరో అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు.

షారూఖ్ కొనుగోలు చేసిన లగ్జరీ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) ఖరీదు భారీగా ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు విలువ రూ.10కోట్ల వరకు ఉంటుందని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఇండియాలో ఇప్పటి వరకు జరిగిన ఎస్‌యూవీ లావాదేవీల్లో ఇదే అత్యంత ఖరీదైందని వినికిడి. సాధారణంగా రోల్స్ రాయిస్ కలినన్ బ్లాక్ బ్యాడ్జ్ ధర ఢిల్లీ ఎక్స్ రూంలో రూ.8.2కోట్ల వరకు ఉంటుంది. కానీ, కారును వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తారు. అందువల్ల కారు ధర రూ.10కోట్లకు చేరిందని తెలుస్తోంది.

‘పఠాన్’ ఇచ్చిన జోష్‌తో షారూఖ్ ఖాన్ నాన్‌స్టాప్‌గా షూటింగ్స్ చేస్తున్నారు. అట్లీ (Atlee) దర్శకత్వంలో ‘జవాన్’ (Jawan)లో నటిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియాగా రూపొందుతుంది. ఈ మూవీలో నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కుమార్ హిరాణీ డైరెక్షన్‌లోను ‘ఢంకీ’ చేస్తున్నారు. ఈ సినిమా క్రిస్‌మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-27T15:54:24+05:30 IST