Kangana Ranaut: అతని వల్లే ప్రియాంక చోప్రా బాలీవుడ్‌ని వదిలేసింది.. షాకింగ్ విషయాలు చెప్పిన ఫైర్‌బ్రాండ్

ABN , First Publish Date - 2023-03-28T12:42:22+05:30 IST

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Kangana Ranaut: అతని వల్లే ప్రియాంక చోప్రా బాలీవుడ్‌ని వదిలేసింది.. షాకింగ్ విషయాలు చెప్పిన ఫైర్‌బ్రాండ్
Kangana Ranaut about Priyanka Chopra

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో జరిగే వివిధ అంశాలపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంటుంది. ఇటీవలికాలంలో ఎక్కువగా తన సినిమాలతో కంటే వివాదాస్పద వ్యాఖ్యలు (Controversy) చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఈ బ్యూటీ తాజాగా మరోసారి బాలీవుడ్ మాఫియాపై తనదైన శైలిలో విమర్శలు చేసింది.

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ప్రస్తుతం హాలీవుడ్‌ (Hollywood)లో వరుస ప్రాజెక్టులు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రియాంక మాట్లాడుతూ పలు షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. ‘బాలీవుడ్‌లో నన్ను కార్నర్ చేశారు. నాకు అవకాశాలు ఇవ్వలేదు. కొందరు కావాలనే నా మీద కక్ష్య కట్టి అవకాశాలు రాకుండా.. అడ్డుకున్నారు. ఆ రాజకీయాలతో విసిగిపోయాను. అందుకే కొంచెం బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను. అదే సమయంలో నా ప్రస్తుత మేనేజర్ నా మ్యూజిక్ వీడియోలను చూసి నాకు కాల్ చేసింది. అమెరికాలో సంగీత వీడియోలో చేస్తారా అని అడిగింది. దాంతో.. వచ్చిన అవకాశాన్ని అందుకుని ప్రస్తుతం ఇలా ఉన్నాను’ అని ఆవేదన చెప్పుకొచ్చింది. (Karan Johar had banned Priyanka Chopra)

దీనికి సంబంధించిన వీడియోలు, వార్తలు వైరల్ అవ్వడంతో ఎంతోమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దీనిపై తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా స్పందించింది. కంగన షేర్ చేసిన ట్వీట్‌లో.. ‘బాలీవుడ్ జనాలు గ్యాంగ్‌గా మారి ప్రియాంకను ఇండస్ట్రీ నుంచి తరిమికొట్టారు. వారి బెదిరింపుల వల్లే కష్టపడి ఎదిగిన ఓ మహిళ దేశాన్ని వదిలేసి వెళ్లిపోయింది. అదే ప్రియాంక చెప్పాలనుకుంటోంది. అయితే.. కరణ్ జోహార్ ఆమెను నిషేధించాడని అందరికీ తెలుసు’ అని రాసుకొచ్చింది.

అలాగే మరో ట్వీట్‌లో..‘ప్రియాంక చోప్రా, షారుఖ్‌ ఖాన్ (Shah Rukh Khan)తో స్నేహం చేయడం వల్ల కరణ్ జోహార్‌ (Karan Johar)కి కోపం వచ్చింది. దాంతో సినిమా మాఫియా (Movie Mafia) ఆమెపై పగబట్టింది. దీని గురించి మీడియాలో కూడా చాలా వార్తలు వచ్చాయి. వారందరూ కలిసి వేధించి ప్రియాంకని దేశం వదిలేలా చేశారు. ఇలాంటి అసహ్యకరమైన, అసూయ, నీచమైన, విషపూరితమైన వ్యక్తి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) లేదా షారుఖ్ పరిశ్రమలోని వచ్చే సమయంలో లేడు. ఇండస్ట్రీని నాశనం చేసినందుకు అతనే బాధ్యత వహించాలి. అతని గ్యాంగ్, పీఆర్ మాఫియా బయటి వ్యక్తులను నిత్యం వేధిస్తూనే ఉంటుంది’ అని ఘాటుగా రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి:

Akanksha Dubey: యువ నటి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. అతను మోసం చేయడం వల్లేనంటూ..

Global Icon Allu Arjun: స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్‌ స్టార్‌గా.. 20 ఏళ్లలో ఎన్ని మార్పులు..

Vivek Agnihotri: రాహుల్ గాంధీపై కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఇప్పుడు అధికారికం మాత్రమేనంటూ..

Nawazuddin Siddiqui: నటుడిపై సోదరుడి షాకింగ్ ఆరోపణలు.. ముగ్గురు భార్యలతో పాటు..

Akanksha Dubey: ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో లైవ్.. వెక్కి వెక్కి ఏడ్చిన నటి..

Nawazuddin Siddiqui: ఆ ఇద్దరిపై 100 కోట్ల దావా.. తననే మోసం చేశారంటూ..

NTR: ఆ భావోద్వేగం కలిసొచ్చింది.. వారిద్దరూ కలిస్తే అంతేమరి..

Dasara Movie: సుకుమార్‌పై కామెంట్స్.. కాంట్రవర్సీలపై నాని రియాక్షన్ ఏంటంటే..

Updated Date - 2023-03-28T12:42:23+05:30 IST