Aishwarya Rai: పొన్నియిన్ సెల్వన్‌లో అందాల తార.. ట్రైలర్ చూసి బాలీవుడ్‌‌ని విమర్శిస్తున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2023-03-30T14:52:26+05:30 IST

మణిరత్నం (Maniratnam) కలల ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’‌ (Ponniyin Selvan)లో బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Aishwarya Rai: పొన్నియిన్ సెల్వన్‌లో అందాల తార.. ట్రైలర్ చూసి బాలీవుడ్‌‌ని విమర్శిస్తున్న నెటిజన్లు
Aishwarya Rai

మణిరత్నం (Maniratnam) కలల ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’‌ (Ponniyin Selvan)లో బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగం ‘పొన్నియిన్ సెల్వన్ I’‌ గతేడాది సెప్టెంబర్ 30న విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. దాంతో.. రెండో భాగంపై భారీ క్రేజీ ఏర్పడింది. ‘పొన్నియిన్ సెల్వన్ 2’ (Ponniyin Selvan 2)ని ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ‌సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో మూవీ టీజర్‌ని మూవీ టీం విడుదల చేసింది.

aishwarya-rai1.jpg

అందులో.. ఐశ్వర్య లుక్స్ చూసి సినీ లవర్స్ ఫిదా అయిపోతున్నారు. నటి యాక్టింగ్ సూపర్ ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా.. ఐశ్వర్యలోని నటిని హిందీ చిత్ర పరిశ్రమ సరిగా ఉపయోగించుకోలేకపోయిందని విమర్శలు చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే.. ‘ మణిరత్నంలాగా ఐశ్వర్యను బాలీవుడ్ ఉపయోగించుకోలేకపోయింది. ఈ తార నందిని పాత్రలో చాలా క్రూరంగా, అలాగే ప్రసన్నంగా కనిపించింది’ అని ఒకరు.. ‘నందిని పాత్ర కోసమే ఐశ్వర్య పుట్టింది. ఆమె తన అందాన్ని అన్నింటికంటే ప్రాణాంతకమైన ఆయుధంగా ఉపయోగించే రాణి. కొన్నాళ్ల క్రితం నేను పీఎస్‌ పుస్తకాన్ని మొదటిసారి చదివినప్పుడే, ఐశ్వర్యని నేను నందినిగా ఊహించుకున్నాను’ అని మరొకరు రాసుకొచ్చారు. (Ponniyin Selvan 2 Trailer Out)

aishwarya-rai2.jpg

కాగా.. ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని కల్కి రాసిన నవల ఆధారంగా మణిరత్నం తెరకెక్కించాడు. ఈ చిత్రంలో జయం రవి, విక్రమ్, కార్తీ, త్రిష కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్, శోభిత ధూళిపాళ కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.

ఇవి కూడా చదవండి:

Dasara Twitter Review: నాని మొదటి పాన్ ఇండియా మూవీ ఎలా ఉందంటే..

Sridevi Shoban Babu OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన బావామరదళ్లు.. ఎక్కడ చూడొచ్చంటే..

Taapsee Pannu: తాప్సీపై కేసు.. ఆ సమయంలో లక్ష్మీదేవి లాకెట్ ధరించడంతో..

Adipurush: రిలాక్స్ ప్రభాస్ ఫ్యాన్స్.. వాటిని నమ్మొద్దు.. దానికే ఫిక్సయిపోండి..

Shah Rukh Khan Vs Virat Kohli: సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..

Akanksha Dubey: యువ నటి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. అతను మోసం చేయడం వల్లేనంటూ..

Global Icon Allu Arjun: స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్‌ స్టార్‌గా.. 20 ఏళ్లలో ఎన్ని మార్పులు..

Akanksha Dubey: ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో లైవ్.. వెక్కి వెక్కి ఏడ్చిన నటి..

Updated Date - 2023-03-30T14:52:39+05:30 IST