Sanjay Dutt: యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా అపశ్రుతి

ABN , First Publish Date - 2023-04-12T19:02:37+05:30 IST

బాలీవుడ్ టాప్ హీరోల్లో సంజయ్ దత్ (Sanjay Dutt) ఒకరు. ‘కెజిఎఫ్’ (KGF) సినిమాతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికి చేరువయ్యారు. ఈ చిత్రంలో అధీరా పాత్రతో ప్రేక్షకులను అలరించారు.

Sanjay Dutt: యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా అపశ్రుతి

బాలీవుడ్ టాప్ హీరోల్లో సంజయ్ దత్ (Sanjay Dutt) ఒకరు. ‘కెజిఎఫ్’ (KGF) సినిమాతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికి చేరువయ్యారు. ఈ చిత్రంలో అధీరా పాత్రతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం కన్నడ మూవీ ‘కేడీ: ద డెవిల్’ (KD The Devil) లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌లో ఆయన గాయపడ్డారు.

‘కేడీ: ద డెవిల్’ (KD The Devil) లో యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా (Dhruva Sarja) హీరోగా చేస్తున్నారు. ధ్రువ ఈ సినిమాలో సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. అందువల్ల మూవీపై భారీ బజ్ ఉంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో జరగుతుంది. చిత్రీకరణలో భాగంగా ఓ యాక్షన్ సీన్‌ను షూట్ చేస్తున్నారు. ఈ సీన్‌ చిత్రీకరణ సమయంలోనే సంజయ్ దత్ గాయపడ్డారు. ఆ సమయంలో సినిమా హీరో ధ్రువ్ సర్జా అక్కడే ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సంజు బాబా ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు చిత్రబృందం తెలుపుతుంది. గాయాలైనప్పటికీ ప్రొఫెషనల్ మాదిరిగా యాక్షన్ సీన్‌ను పూర్తి చేశారని సమాచారం అందుతుంది. ‘కేడీ ది డెవిల్’ స్టైలిష్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ప్రేమ్ (Prem) తెరకెక్కిస్తున్నారు. ఆయన గతంలో ‘ది విలన్’, ‘జోగి’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అర్జున్ జన్య మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sanjay-Dutt.jpg

ఇక సంజయ్ దత్ కెరీర్ విషయానికి వస్తే.. లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) తెరకెక్కిస్తున్న ‘లియో’ (Leo)లో విలన్ రోల్ చేస్తున్నారు. ‘జవాన్’ లో అతిథి పాత్రను పోషిస్తున్నారు. అందులో భాగంగా షారూఖ్ ఖాన్‌తో తలపడనున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

SSMB29: పురాణాల స్ఫూర్తితో మహేశ్ బాబు పాత్ర

Pawan Kalyan: పవర్ స్టార్ సినిమాకు సీక్వెల్!

Allu Arjun: ‘వేర్ ఈజ్ పుష్ప’ ప్రమోషన్ వీడియోకు భారీ ఖర్చు..?

Jr NTR: భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్న తారక్!

Chor Nikal Ke Bhaga: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును చెరిపేసిన బాలీవుడ్ సినిమా

Updated Date - 2023-04-12T19:11:13+05:30 IST