Amrita Rao: సల్మాన్ ఖాన్‌తో సినిమా అవకాశం తప్పిపోవడానికి కారణమిదే!

ABN , First Publish Date - 2023-03-27T18:08:36+05:30 IST

తెలుగులో సంచలన విజయం సాధించిన సినిమా ‘పోకిరి’ (Pokiri). ఈ చిత్రం పలు భాషల్లో రీమేక్ అయింది. హిందీలో ‘వాంటెడ్’ (Wanted) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘వాంటెడ్’ లో సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా నటించారు.

Amrita Rao: సల్మాన్ ఖాన్‌తో సినిమా అవకాశం తప్పిపోవడానికి కారణమిదే!

తెలుగులో సంచలన విజయం సాధించిన సినిమా ‘పోకిరి’ (Pokiri). ఈ చిత్రం పలు భాషల్లో రీమేక్ అయింది. హిందీలో ‘వాంటెడ్’ (Wanted) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘వాంటెడ్’ లో సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా నటించారు. అయేషా టకియా (Ayesha Takia) హీరోయిన్ పాత్రను పోషించారు. ప్రభుదేవా దర్శకత్వం వహించారు. 2009లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అయితే, ఈ ప్రాజెక్టులో మొదట హీరోయిన్‌గా చేసే అవకాశం తనకే వచ్చిందని అమృతా రావ్ (Amrita Rao) తెలిపారు. కానీ, క్రూరమైన మేనేజర్ వల్ల ఆ ఛాన్స్ తప్పిపోయిందని ఆమె పేర్కొన్నారు.

అమృతా రావ్ ‘కఫుల్ ఆఫ్ థింగ్స్’ (Couple of Things) అనే పుస్తకాన్ని రాశారు. ‘వాంటెడ్’ కు సంబంధించిన ఘటనకు అందులో వివరించారు. ‘‘సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుని తాజ్ బంజరా లాబీలో ఉన్న వేచి ఉన్నాను. బొనీ కపూర్‌ కంపెనీలో పనిచేసే ఓ వ్యక్తి వచ్చి నన్ను పలకరించారు. కుశల ప్రశ్నలు అడిగారు. డేట్స్ క్లాష్ కాకపోతే ‘వాంటెడ్’ సినిమా మనం చేసే వాళ్లం కదా అని ఆ వ్యక్తి చెప్పారు. అప్పుడు నేను అయోమయంగా చూశాను. వాంటెడ్ కోసం మీరు ఎప్పుడు నన్ను సంప్రదించారని ప్రశ్నించాను. మేం నీ మేనేజర్ కు కాల్ చేస్తే.. డేట్స్ అందుబాటులో లేవని సమాధానం వచ్చిందని ఆ వ్యక్తి తెలిపారు. ఈ విషయం తెలియడంతో నేను షాక్‌ను గురయ్యాను’’ అని అమృతా రావ్ చెప్పారు.

‘వాంటెడ్’ ను బోనీ కపూర్ భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాతో సల్మాన్ ఖాన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణను ఆయన సంపాదించుకున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-27T18:09:00+05:30 IST