Bade Miyan Chote Miyan: బాధను భరిస్తూనే షూటింగ్‌లో పాల్గొంటున్న హీరో

ABN , First Publish Date - 2023-03-27T16:46:14+05:30 IST

బాలీవుడ్‌లో శర వేగంగా సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). ప్రతి ఏడాది ఐదు నుంచి ఆరు సినిమాలు చేస్తుంటారు. ప్రస్తుతం ‘బడే మియా చోటే మియా’ (Bade Miyan Chote Miyan) లో నటిస్తున్నారు.

Bade Miyan Chote Miyan: బాధను భరిస్తూనే షూటింగ్‌లో పాల్గొంటున్న హీరో

బాలీవుడ్‌లో శర వేగంగా సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). ప్రతి ఏడాది ఐదు నుంచి ఆరు సినిమాలు చేస్తుంటారు. ప్రస్తుతం ‘బడే మియా చోటే మియా’ (Bade Miyan Chote Miyan) లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టాప్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ (Ali Abbas Zafar) తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం బ్రిటన్‌లో జరుగుతుంది. ‘బడే మియా చోటే మియా’ చిత్రీకరణలో కొద్ది రోజుల క్రితం అక్షయ్ కుమార్ తీవ్రంగా గాయ పడ్డారు. యాక్షన్ సీన్ చిత్రీకరణలో ఆయన పాల్గొంటున్నప్పుడు మోకాలికి తీవ్ర గాయాలమయింది. అయినప్పటికీ, అక్షయ్ విశ్రాంతి తీసుకోవడం లేదు. నిర్మాతకు నష్టం వాటిల్లకూడదని ఆలోచనతో సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

‘బడే మియా చోటే మియా’ ను పూజా ఎంటర్‌టైన్‌మెంట్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. జాకీ భగ్నానీ, వాషు భగ్నానీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమా చిత్రీకరణలో భాగంగా నిర్మాత బ్రిటన్‌లో భారీ స్థాయి యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఈ సీన్స్‌ను కొరియోగ్రఫ్ చేస్తున్నారు. ఈ పోరాట సన్నివేశాల కోసం దాదాపుగా రూ.15కోట్లను వెచ్చిస్తున్నారు. తాను సినిమా చిత్రీకరణకు విరామం ఇస్తే నిర్మాత భారీగా నష్టపోతారని అక్షయ్ భావించారు. అందువల్ల బాధను భరిస్తూనే మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

‘బడే మియా చోటే మియా’ లో మరో హీరోగా టైగర్ ష్రాఫ్ (Tiger Shrof) నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) విలన్ పాత్రను పోషిస్తున్నారు. మూవీ షూటింగ్ ఏప్రిల్ మధ్య వరకు బ్రిటన్‌లోనే జరగనుంది. అనంతరం సినిమా చిత్రీకరణను ఇండియాలో చేపట్టనున్నారు. ఈ చిత్రం క్రిస్‌మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-27T16:46:38+05:30 IST