Amitabh Bachchan: గాయపడిన అనంతరం తొలిసారి బయటికి వచ్చిన బిగ్ బీ.. ఫొటోలు వైరల్..

ABN , First Publish Date - 2023-03-27T19:59:00+05:30 IST

సినిమా చిత్రీకరణలో ఇటీవల అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) గాయపడ్డారు. ‘ప్రాజెక్ట్ కె’ (Project K) మూవీ షూటింగ్‌లో యాక్షన్ సన్నివేశం చేస్తుండగా ఆయన పక్కటెముకలకు గాయమయింది.

Amitabh Bachchan: గాయపడిన అనంతరం తొలిసారి బయటికి వచ్చిన బిగ్ బీ.. ఫొటోలు వైరల్..
Amitabh Bachchan

సినిమా చిత్రీకరణలో ఇటీవల అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) గాయపడ్డారు. ‘ప్రాజెక్ట్ కె’ (Project K) మూవీ షూటింగ్‌లో యాక్షన్ సన్నివేశం చేస్తుండగా ఆయన పక్కటెముకలకు గాయమయింది. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ముంబయిలోని తన నివాసానికి వచ్చేశారు. తాను క్షేమంగానే ఉన్నానని సమాచారమిచ్చారు. కానీ, అభిమానులను కలవలేకపోతున్నట్టు చెప్పారు. కొన్ని వారాల విశ్రాంతి అనంతరం బిగ్ బీ తొలిసారిగా బయటికి వచ్చారు. ఫ్యాన్స్‌ను పలకరించారు. అందుకు సంబంధించిన ఫొటోలను అమితాబ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘పనిని ప్రారంభించాలి. అందరి ఆశీస్సులతో కోలుకున్నాను’’ అని ఆయన తెలిపారు.

అమితాబ్ బచ్చన్ అంతకు ముందు వేగంగా కోలుకుంటున్నట్టు చెప్పారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నా. ఏదైనా జరిగితే బాధ పడకుండా దాన్ని అధిగమించడమే మన పని. మనకు ఎంత వేగంగా గాయమవుతుందో అంతే వేగంగా మన శరీరం దాన్ని నయం చేస్తుంది’’ అంటూ స్ఫూర్తిమంతమైన పోస్ట్ పెట్టారు.

‘ప్రాజెక్ట్‌ కె’ (Project K)లో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్ పాత్రను చేస్తున్నారు. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. దిశా పటానీ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-27T19:59:01+05:30 IST