సూర్య-జ్యోతిక.. మళ్లీ పెళ్లి

కోలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్

సూర్య - జ్యోతిక దంపతులు 

ఇరువై ఏళ్ల తమ విజయవంతమైన 

వివాహ బంధానికి గుర్తుగా

ప్రకృతి ఒడిలోని ఒక కోట ఆవరణలో 

క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో

మరోసారి పెళ్లి చేసుకున్నారు.

 తమ పిల్లలు దేవ్, దియా మరియు  

తమ్ముడు కార్తీ సమక్షంలో మ్యాచింగ్

వైట్ దుస్తుల్లో ముచ్చటగా ముస్తాబై 

జరిగిన ఈ అరుదైన వేడుకకు 

సంబంధించిన వీడియోను ‘ది సీక్వెల్’ 

క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పంచుకున్నారు.

జీవిత ప్రయాణంలో నిస్వార్థమైన ప్రేమను, 

సర్దుబాట్లను వేడుకగా జరుపుకున్న 

ఈ దంపతుల భావోద్వేగపూరిత క్షణాలు 

ప్రస్తుతం నెట్టింట విపరీతంగా 

వైరల్ అవుతుండగా, అభిమానులు వారికి 

హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.