నిహారిక ఎన్ఎం గురించి ఈ విషయాలు తెలుసా

నిహారిక ఎన్ ఎం సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్, యూట్యూబర్. షార్ట్  వీడియోలతో పాపులర్ అయ్యారు

ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ నుంచి టర్న్ తీసుకుని  సినిమా రంగం వైపు అడుగులు వేస్తున్నారు

చెన్నై ఆమె  జన్మస్థలం. పెరిగింది అంత బెంగళూరు.  బీఎంఎస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో  ఇంజనీరింగ్‌ పట్టా పొందింది

ఆ తర్వాత  అమెరికాలోని చాప్మన్ యూనివర్సిటీ, కాలిఫోర్నియాలో ఎంబీఏ  చేసింది. చదువుతో పాటు సోషల్ మీడియా కంటెంట్ సృష్టించడంపై ఆసక్తి పెంచుకుంది

నిహారిక  Types of People సిరీస్‌తో మొదట గుర్తింపు తెచ్చుకుంది. ఆ వీడియోలు తెలుగు, తమిళ, ఇంగ్లీష్‌ భాషల్లో  వీడియోలు చేసి యూత్ కి బాగా కనెక్ట్ అయింది

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.  ఆమెకు  4 మిలియన్లకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు.

2023లో Forbes India Digital Stars లిస్టులో కూడా చోటు దక్కింది. ఆమె బెంగళూరు యాస, అమెరికన్ యాక్సెంట్ కలిసిపోవడం ప్రత్యేకత

నిహారిక  డైలాగ్‌ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్‌ వల్లనే ఫ్యాన్స్‌ బేస్‌ పెరిగింది.  'మిత్రమండలి'  తెలుగు చిత్రంతో వెండితెరపైకి ఎంట్రీ ఇస్తున్నారు

సోషల్ మీడియా నుంచి సినిమాల వైపు అడుగులు వేస్తూ, నటిగా తన ప్రయాణం ప్రారంభించారు

నిహారిక 2023లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరై చర్చల్లో నిలిచారు.టామ్ క్రూజ్‌, కరణ్ జోహార్‌ వంటి అంతర్జాతీయ, బాలీవుడ్‌ సెలబ్రిటీలతో కూడా  కలిసారు

మార్పు అనేది అవసరం. కాలంతో పాటుగా మనం కూడా మారాలి అంటారామె.