మ‌హేశ్ మేన‌కోడ‌లు..  జాన్వీ ఇంత షాకిచ్చిందేంటి

సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మంజుల కూతురు. సూప‌ర్ స్టార్  మహేశ్ బాబు స్వయానా మేన కోడలు జాన్వీ స్వరూప్ త్వరలోనే తెరంగేట్రం చేయనుంది

జాన్వీ సినీ ఇండస్ట్రీ ఎంట్రీపై  ఇన్‌స్టా వేదికగా త‌ల్లి మంజుల  ఘట్టమనేని ఈ విష‌యం  పంచుకుంది.

 2018 మంజుల దర్శకత్వంలో  సందీప్ కిషన్ హీరోగా వ‌చ్చిన‌  ‘మనసుకు నచ్చింది’లో బాల నటిగా జాన్వీ మంచి పేరు తెచ్చుకుంది

జాన్వీ పుట్టినరోజు సందర్భంగా  ఆమె సినీ ఎంట్రీని వెల్లడిస్తూ..  తాజాగా మంజుల ఈ ఫొటోలను  విడుదల చేయ‌గా సోషల్‌  మీడియాలో వైరల్‌గా మారాయి

కుమార్తె తెరంగేట్రంపై మంజుల  ఆనందం వ్యక్తంచేస్తూ ఆమెను ఆదరించాలని అభిమానుల‌ను,  ప్రేక్షకులను కోరారు.

నా ముద్దుల కూతురు జాన్వీ  స్వరూప్.. బాగా పెద్దదైంది..  తనదైన జీవితంలోకి అడుగు పెట్టడానికి సిద్ధమైంది.. 

ఆమె తనతో పాటు ఓ  ప్రకాశవంతమైన వారసత్వాన్ని  వెంట తీసుకొస్తోంది.. ఇప్పుడిక  వెలగడం ఆమె వంతు. 

ఆమె మ్యాజిక్, ఆమె టాలెంట్,  ఆమె మనసుపై నాకు నమ్మకం ఉంది.  నాకు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తిని ప్రపంచం చూడటానికి సిద్ధంగా ఉంది 

నా డార్లింగ్.. నీ కోసం స్క్రీన్,  ఈ ప్రపంచం వేచి చూస్తోంది.  ఐ లవ్యూ సో మచ్.. హ్యాపీ బర్త్ డే  మై జాను” అనే క్యాప్షన్ తో  ఇన్‌స్టాలో మంజుల పోస్ట్ చేసింది.

ఫ‌స్ట్ టైం కృష్ణ ఫ్యామిలీ నుంచి  జాన్వీ స్వరూప్ హీరోయిన్‌గా  ఎంట్రీ ఇవ్వనుండడంతో  స‌ర్వ‌త్రా ఆసక్తి నెలకొంది.

జాన్వీ నటించనున్న సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.