హ‌య్య‌స్ట్ పెయిడ్‌ టీవీ ఆర్టిస్టు తేజ‌స్వి గురించి మీకు తెలుసా?

హిందీ టీవీ న‌టిగా కెరీర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు 

ఇండియా టాప్ మోడ‌ల్‌గా, హ‌య్య‌స్ట్ పెయిడ్‌ ఆర్టిస్టుగా ఎదిగింది తేజ‌శ్వీ ప్ర‌కాశ్‌.

ఆపై హిందీ బిగ్‌బాస్ 15 విన్న‌ర్‌గా నిలిచి రెండింత‌ల గుర్తింపు ద‌క్కించుకుంది. 

ఫీల్డ్‌కు వ‌చ్చి పుష్క‌రం పూర్తి చేసుకున్న  ఈ బ్యూటీ నాగిన్‌, స్వ‌రాగిని వంటి

టీవీ సీరియ‌ల్స్‌తో అదిరిపోయే ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

హీరోయిన్‌గా రెండు హిందీ సినిమాలు కూడా చేసిన ఈ ముద్దుగుమ్మ 

అధికంగా సీరియ‌ల్స్‌, మ్యూజిక్ వీడియోస్‌, రియాలిటీ షోల‌కు మాత్ర‌మే

ప్ర‌యారిటీ ఇస్తు త‌న  ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటుంది

వాటితోనే బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను మించి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుంది. 

అంతేగాక బిగ్‌బాస్‌లో పరిచ‌య‌మైన క‌రణ్‌ కుంద్రాతో నాలుగేండ్లుగా 

డేటింగ్ చేస్తూ త‌రుచూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేస్తూ ఉంటుంది.

ప‌ర్స‌న‌ల్ లైఫ్‌, ప‌బ్లిక్ లైఫ్  ఎప్పుడైనా అంత‌కు మించి అనే తీరున

అందాల ప్ర‌ద‌ర్శ‌ణతో ఉడికిస్తుంటుంది. తేజ‌స్వీ ఫొటోలు వ‌స్తున్నాయంటే

అభిమానులు, నెటిజ‌న్లు ప‌డి  చ‌స్తారన‌డంలో సందేహాం లేదు.

ఇప్ప‌టికే ఈ అమ్మ‌డిని వివిధ‌ సోష‌ల్ మీడియాల్లో కోటి మందికి పైగా 

ఫాలో అవుతున్నారంటే ఈ సుంద‌రాంగి రేంజ్‌ ఏ లెవ‌ల్‌లో ఉందో అర్థ‌మ‌వుతుంది.

అయితే.. ఎక్క‌డికి వెళ్లినా త‌న ప్రియుడు ప‌క్క‌న ఉండాల్సిందే. అత‌ను లేకుండా 

ఇంటి నుంచి బ‌య‌ట అడుగు పెట్టదంటే మీరు న‌మ్మరు. నెట్టింట వీరిద్ద‌రి ఫొటోలు, వీడియోలు డ‌జ‌న్ల కొద్ది ద‌ర్శ‌ణ‌మిస్తాయి.

ఇంకెందుకు ఆల‌స్యం ఆ అందాలనూ మీరూ ఓ సారి క‌నులారా వీక్షించేయండి.