సెన్సేషన్ అయ్యేందుకు అలాంటి ప్రశ్నలా అడిగేది

మీడియా జర్నలిస్ట్‌లు అనాగరికమైన ప్రశ్నలు అడగవద్దని, పరస్పరం గౌరవించుకునేలా వారి ప్రవర్తన ఉండాలి.

ఇటీవల చెన్నై నగరంలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. 

ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 

‘మీరు కూడా హీరోయిన్ త్రిషలాగే సీఎం విజయ్‌తో కలిసి ప్రయాణిస్తారా?’ అంటూ మీడియా ప్రశ్నించింది.

ఆమె వెంటనే, ఇది అసందర్భం, అనవసరమైన ప్రశ్న అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. 

ఆ తర్వాత తన ఎక్స్ ఖాతాలో కూడా దీనిపై ఆమె ట్వీట్ చేశారు.

తమిళ మీడియా మిత్రులపై నాకు అపారమైన గౌరవ మర్యాదలున్నాయి. 

కానీ, కొందరు సంచలనాల కోసం అనాగరికమైన ప్రశ్నలు అడుగుతున్నారు. 

నాకు విజయ్ గత ఏడేళ్లుగా తెలుసు. అతని పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. 

అతడిని ఒక స్నేహితుడిగా పిలుచుకునే అవకాశం లభించినందుకు నేను సంతోషంగా ఉన్నాను. 

తెరపైనా, నిజ జీవితంలో ఆయన జర్నీ చూడటం ఒక అద్భుతమైన అనుభవం. 

భవిష్యత్‌లో మీడియాతో జరిగే అన్ని చర్చలను స్వాగతిస్తాను. కానీ, 

అవి గౌరవప్రదంగా, పరస్పర మర్యాదలతో, అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జరగాలని చెప్పారు.