కోట  శ్రీనివాసరావు.. అందరికీ నచ్చడు 

తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన కోట శ్రీనివాసరావు ఆదివారం  తుది శ్వాస విడిచిన సంగ‌తి అంద‌రికి విధిత‌మే

ఈవార్త తెలుసుకున్న‌ సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు అనేక మంది త‌రలి వ‌చ్చి  కోట శ్రీనివాసరావు పార్ధీవ దేహానికి న‌మ‌స్క‌రించి నివాళులర్పించారు

ఈ నేప‌థ్యంలో ప్ర‌కాష్ రాజ్ సైతం కోట గారి క‌డ‌సారి చూపు కోసం వ‌చ్చి  ఆయ‌న మాట్లాడుతూ.. 

కోట గారి సినిమాలు చూసి  చాలా స్పూర్తి పొందాన‌ని,  ఎన్నో సినిమాల్లో కలిసి  నటించామ‌ని ఆయ‌న ఎంతో  విశిష్డ మైన వ్యక్తి అని..‌ 

అందరికీ నచ్చడు.. ఎవరిని మెప్పించటానికి ప్రయత్నం  చేయడ‌ని, ఆయనది  ఒక ప్రజెన్స్ అని.. తన మాట‌ల్లో  ఓ వ్యంగ్యం ఉండేది అన్నారు

తెలుగు ప్రతిభకు చాన్స్ దొరకటం లేదని అనగానే తొలుత  నాకు బాధ వేసిందని.. కానీ  ఆ తరువాత వారి బాధ నిజమే అని అర్దమయిందన్నారు.

ప్రకాష్ రాజ్ తెలుగు వారు కాదు  కదా అంటే.. తెలుగు మాట్లాడతాడు.. పరాయివాడు కాదు అనే వారు,

నాపై కూడా ఛలోక్తులు విసిరే వారని గుర్తు చేసుకున్నారు. ఈమధ్య  ఫోన్ చేశాన‌ని,  మాతో కలిసి ఓ సినిమా  సెట్‌లో గడిపారని,

వారి ఇంట్లో జరిగిన పెయిన్ ను బయట ఎక్కడా చూపే వారు కాదని వారి వ్యక్తిత్వం నాకు ఎంతో ఇష్డమ‌ని కొనియాడారు