ప్రగతి శ్రీవాత్సవ 'గమ్ గమ్ గణేశా' లో కథానాయకురాలిగా చేస్తోంది. ఈ సినిమా ఈనెల 31న విడుదలవుతోంది. ఆమె గురించి కొన్ని విశేషాలు

ప్రగతి ఢిల్లీ అమ్మాయి, లా చదివింది. ఆమె చిత్రపరిశ్రమలోకి రావటం తండ్రికి ఇష్టం లేదు

చిన్న చిన్న రీల్స్ చేస్తూ, యాడ్స్ లో కూడా నటించింది. విజయ్ దేవరకొండతో నటించిన ఒక యాడ్ లో ఆమెని చూసి మొదటి అవకాశం ఇచ్చారు 

మొదటి సినిమా 'మనుచరిత్ర', శివ కందుకూరి కథానాయకుడు 

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన 'పెద్ద కాపు 1' లో ప్రగతి పల్లెటూరి అమ్మాయిగా చేసింది 

పెద్దకాపు 1' సినిమాకి చాలామంది అమ్మాయిలతో పాటు తాను కూడా ఆడిషన్స్ ఇచ్చి సెలక్టు అయ్యానని చెప్పింది ప్రగతి

తండ్రి గర్వించే విధంగా తన పాత్రల సెలక్షన్ ఉంటుంది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది 

పెద్దకాపు 1' చేస్తున్నప్పుడే ఆనంద్ దేవరకొండ పక్కన 'గమ్ గమ్ గణేశా' లో తీసుకున్నారు

మహేష్ బాబు పక్కన నటించాలన్నదే తన కోరిక అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది