దంగ‌ల్ బ్యూటీ.. తెలుగులో హీరోయిన్‌గా చేసిన సంగ‌తి మీకు తెలుసా?

అమీర్ ఖాన్ మెయిన్ లీడ్‌గా ఫాతిమా స‌నా షేక్‌, జైరా వాసిమ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం దంగ‌ల్‌

 వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిన ఈచిత్రం అంత‌ర్జాతీయంగా ఎన్నో రికార్డులు నెల‌కొల్పింది

అప్ప‌టివ‌ర‌కు బాహుబ‌లి పేర ఉన్న‌అత్య‌ధిక కలెక్ష‌న్ల రికార్డును తిర‌గ‌రాస్తూ రూ.2000 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింది

ఈ సినిమాలో అమీర్‌ఖాన్ కూతురు గీతా పోగ‌ట్‌గా న‌టించిన ఫాతిమా స‌నా షేక్ పేరైతే దేశ‌మంతా బాగా మారుమ్రోగింది

అయితే ఫాతిమా అంత‌కు ముందే హీరోయిన్‌గా చేసిన సంగ‌తి చాలా మందికి తెలియదు.. అదీ కూడా ఓ తెలుగు సినిమాలో

 అప్ప‌టివ‌ర‌కు బాలీవుడ్‌లో బాల‌ న‌టిగా, స‌హాయ న‌టిగా చేసిన ఫాతిమాకు అశించినంత‌గా గుర్తింపు ల‌భించ‌లేదు

ఆ సమయంలో 2015లో రంజిత్ హీరోగా నువ్వు నేను ఒక‌ట‌వుదాం అనే చిత్రంలో  తొలి సారి క‌థానాయిక‌గా చేసింది

సినిమాకు సంబంధించిన ప్ర‌మోషన్ల‌లో, ఈవెంట్లలో కూడా బాగానే సంద‌డి చేసింది

తర్వాత సినిమా విడుదలై  ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక పోయింది

త‌ర్వాత మ‌రో ఒక‌టి రెండు తెలుగు అవకాశాలు వచ్చినా అదే సమయంలో.. 

ఫాతిమాకు దంగ‌ల్ ఛాన్స్ రావ‌డంతో మ‌ళ్లీ తెలుగు చిత్రాల వైపు చూడ‌లేదు

ఈ నువ్వు నేను ఒక‌ట‌వుదాం అనే సినిమా ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది

 ఆపై దంగ‌ల్ విడుద‌లై క‌నీవినీ ఎరుగ‌ని విజ‌యం సాధించడంతో ఫాతిమా బాలీవుడ్‌లో ఓవ‌ర్‌నైట్ స్టార్‌ అయింది

త‌ర్వాత లూడో, థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ వంటి పెద్ద సినిమాలతో బిజీ అయింది

ఇప్పుడు ఎవ‌రు అందుకోలేనంత ఎత్తుకు ఎదిగింది. ఆల్ ది బెస్ట్ ఫాతిమా