తెలుగు టు బాలీవుడ్‌.. ఫాతిమా స‌నా షేక్ గురించి.. మీకు ఈ విష‌యాలు తెలుసా..?

 ఫాతిమా స‌నా షేక్ ఈ పేరు  తెలియ‌ని సినిమా ప్రేక్ష‌కుడు ఉండ‌రు

దంగ‌ల్ సినిమాతో ప్ర‌పంచ‌  వ్యాప్తంగా గుర్తింపు ద‌క్కించుకుంది

కాశ్మీర్‌కు చెందిన హిందూ తండ్రి, ముస్లీం త‌ల్లికి జ‌న్మించిన ఫాతీమా

బాల్యం, విద్యాభ్యాసం అంతా ముంబైలో జ‌రిగింది

1997లో అమీర్‌ఖాన్, అజ‌య్ దేవ‌గ‌ణ్ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన

ఇష్క్ సినిమాతో బాల న‌టిగా ఎంట్రీ ఇచ్చింది

ఆ త‌ర్వాత క‌మ‌ల్‌హ‌స‌న్  న‌టించిన భామ‌నే స‌త్య‌భామ‌నే

హిందీ రిమేక్ చాచి 420  చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది

అదే వ‌రుస‌లో 2001 వ‌ర‌కు  చైల్డ్ ఆర్టిస్ట్‌గా.. 5 సినిమాలు

2008 త‌ర్వాత స‌హాయ న‌టిగా మూడు సినిమాల్లో నటించింది

ఇక 2015లో తెలుగులో  వచ్చిన నువ్వూ నేను ఒక‌ట‌వుదాం

అనే చిత్రంతో మొదటిసారి హీరోయిన్‌గా కేరీర్ స్టార్ట్ చేసింది

ఆ త‌ర్వాత నిజ జీవిత సంఘ‌ట‌న‌ల‌తో రూపొందిన‌ దంగ‌ల్ సినిమాలో

గీతా పోగ‌ట్ పాత్ర‌లో జీవించి అంత‌ర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది

ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 2 వేల కోట్ల‌కు పైగా

వ‌సూళ్లు సాధించిన ఏకైక భార‌తీయ‌ చిత్రంగా ఇప్పటికీ నిల‌వ‌డం గ‌మ‌నార్హం

దీని త‌ర్వాత బాహుబ‌లి చిత్రాలు అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన జాబితాలో ఉన్నాయి

 దంగ‌ల్ త‌ర్వాత లూడో, థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్‌, అజీబ్ ద‌స్తాన్స్‌,

సూర‌జ్ పే మంగ‌ళ్ భారీ, ధ‌క్ ధ‌క్‌, థార్ వంటి చిత్రాల్లో న‌టించి మెప్పించింది

ముఖ్యంగా లూడో, అజీబ్ ద‌స్తాన్స్‌, థార్ వంచి చిత్రాల్లో

బోల్డ్ పాత్ర‌ల్లోనూ న‌టించి ఔరా అనిపించింది

చివ‌ర‌గా 2023లో విక్కీ కౌశ‌ల్ హీరోగా వ‌చ్చిన సాం బ‌హ‌దూర్ సినిమాలో

ఇందిరాగాంధీ పాత్ర‌లో క‌నిపించి అశ్చర్యపోయేలా చేసింది

ఫాతిమా ప్ర‌స్తుతం ఉల్ జలూల్ ఇష్క్ అనే హిందీ సినిమాలో నటిస్తోంది