పేరులో ఎదో కొడువాయూర్ వుంది అని వేరే భాష అమ్మాయి అని అనుకునేరు, రూప అచ్చమైన తెలుగమ్మాయి

తాజాగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి పక్కన చేస్తోంది రూప 

రూప వృత్తి రీత్యా డాక్టరు, లండన్ లో చదివింది. క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకుంది 

మొదటి సినిమా నాలుగేళ్ల క్రితం వచ్చిన 'ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య', సత్యదేవ్ కథానాయకుడు 

రెండో సినిమా బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ కథానాయకుడిగా వచ్చిన 'మిష్టర్ ప్రెగ్నంట్'. ఇందులో రూప నటనకి ప్రసంశలు వచ్చాయి 

మొదటి సినిమా ఓటిటి లో విడుదలైతే, రెండో సినిమా థియేటర్స్ లో విడుదలైంది

తమిళ సినిమా 'నీలిర' కూడా చేసింది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకి సమర్పకుడు 

సత్యదేవ్ తో 'దారే లేదా' అనే ఒక మ్యూజిక్ వీడియో కూడా చేసిన రూప 

ఇప్పుడు దర్శకుడు ఇంద్రగంటి సినిమాతో రూపకి మంచి అవకాశాలు రావొచ్చు