అనన్య నాగళ్ళ అంతరంగం..

సినిమా ఇండస్ట్రీలో సరైన రోల్‌ను పట్టుకోవటం చాలా ముఖ్యం. చాలా చోట్ల అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి.

‘మనం ఎంచుకొనేది సరైనదా? కాదా?’ అనే విషయాన్ని తెలుసుకోవటంలోనే సగం జీవితం అయిపోతుంది.

మొదట్లో కొంత అభద్రతా భావం ఉండేది. ‘నేను అందంగా లేనా? ఈ ఇండస్ట్రీకి సరిపోనా?’ అనిపించేది.

కాలేజీలో.. నేనే పెద్ద షోకిల్లానని అనుకొనేదాన్ని. సినిమాల్లోకి వచ్చిన తర్వాత అందంగా లేనా? అనే ఫీలింగ్‌ ఉండేది.

దక్షిణాది పాత్రలకు- ఇక్కడ అమ్మాయిలే బావుంటారని, వారినే ప్రేక్షకులు ఆదరిస్తారని అర్థమయింది.

ఒక అమ్మాయిగా చెబుతున్నా! అమ్మాయిల జీవితాలను ప్రతిబింబించే సినిమాలు వస్తే బావుంటుంది.

అమ్మాయిలకు కూడా ఒక జీవితం.. వారికి కూడా భావోద్వేగాలు ఉంటాయని  చెప్పే కథలు వస్తే  బాగుంటుంది.

నా ఉద్దేశంలో నటన అందరికీ వస్తుంది. కానీ నటించటానికి కొంత తర్ఫీదుతో పాటు సమయం, ఆసక్తి  ఉంటే ఎవరైనా నటించవచ్చు.

ఈ నాలుగేళ్లలో జయపజయాల కన్నా నా జర్నీ ముఖ్యమని తెలుసుకున్నా

నా ఫేవరెట్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌. సమంతా. వీరిద్దరి జర్నీ నాకు నచ్చుతుంది. ఇద్దరు కష్టపడి పైకి వచ్చినవాళ్లే!