అత్తయ్య ఇంట్లో... అలిసిపోయేంతవరకూ!

చిన్నప్పుడు హోలీ పండుగ రాగానే బ్యాగ్‌ సర్దుకొని రూర్కీలోని మా అత్తయ్య ఇంటికి వెళ్లిపోయేదాన్ని..

కజిన్స్‌ అందరూ వచ్చేవాళ్లు. దాంతో ఇళ్లంతా సందడి సందడిగా ఉండేది..

పొద్దున్నే లేచి మేమంతా హోలీ డెకరేషన్‌ పనులు చూసుకునేవాళ్లం.. 

అలాగే కావాల్సిన రంగులన్నీ సిద్ధం చేసేవాళ్లం.. 

మరోవైపు అత్తయ్య మా కోసం రకరకాల వంటలను తయారుచేసి పెట్టేది.. 

రంగులు చల్లుకుంటూ డీజే పాటలకు చిందులేసేవాళ్లం.. 

అలా.. అలిసిపోయేంతవరకూ ఆ రంగుల్లో తడిసి ముద్దయ్యేవాళ్లం.. 

హోలీనాడు పసుపు రంగు దుస్తులు ధరించడానికి ఎక్కువ ఇష్టపడతా..