హీరో నాని తొలి జీతం ఎంతో తెలుసా.. ?

న్యాచురల్ స్టార్ నాని క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టి, ఇప్పుడు స్టార్ హీరోగా తనకంటూ  గుర్తింపు తెచ్చుకున్నాడు.

అసిస్టెంట్ డైరెక్టర్‏గా కెరీర్ ప్రారంభించిన నాని.. అష్టాచెమ్మా సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు.

ఆ తర్వాత వరుస హిట్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు.

డిగ్రీ పూర్తి కాగానే ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన నాని.. మొదట్లో దర్శకులు బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‎గా పనిచేశారు.

అసిస్టెంట్ డైరెక్టర్‎గా ఉన్నప్పుడు తన జీతం కేవలం రూ.4000  మాత్రమే అని, మొదటి జీతం తీసుకున్న క్షణం ఇప్పటికీ గుర్తుందన్నారు.

ఆ తర్వాత పిల్ల జమీందార్, అలా మొదలైంది, ఈగ, నేను లోకల్, మిడిల్ క్లాస్ అబ్బాయి వంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు.

అంతే కాదు నిర్మాతగా మారి వాల్ పోస్టర్స్ బ్యానర్ పై కథ బలమున్న సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా అయన నిర్మించిన కోర్ట్ సినిమా సూపర్ హిట్ అయింది.

ప్రస్తుతం ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నాడు నాని