ఆమిర్‌ ఖాన్‌ను చూసి  గుత్తా జ్వాల భావోద్వేగానికి గురయ్యారు

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల, నటుడు విష్ణు విశాల్‌ వివాహం చేసుకున్న సంగతి తెల్సిందే

ఏప్రిల్‌ 22, 2021న విష్ణు విశాల్‌- గుత్తాజ్వాల మూడు ముళ్ళ  బంధంతో ఒకటయ్యారు

ఈ ఏడాది ఏప్రిల్‌ 22న వీరికి పాప పుట్టడం విశేషం

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌  ఆమిర్‌ ఖాన్‌  ఆ పాపకు నామకరణం చేశారు

దీనికి సంబందించిన  ఫోటోలను విష్ణు విశాల్   సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు

తమ బిడ్డ పేరు మిరా అని విష్ణు విశాల్ - గుత్తా జ్వాల తెలిపారు

తమ  బేబీకి పేరు పెట్టడానికి హైదరాబాద్‌ వచ్చిన ఆమిర్‌ఖాన్‌కు  ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు

మిరా అంటే శాంతి, షరతుల్లేని ప్రేమ. ఆమిర్‌ సర్‌తో ప్రయాణం అద్భుతం అని విష్ణు పేర్కొన్నారు

గుత్తా జ్వాల భావోద్వేగానికి లోనయ్యారు. ఆమిర్‌ఖాన్‌ రాకపోతే ఈ ఈవెంట్‌ ఇంత ఘనంగా జరిగేది కాదని పేర్కొన్నారు