Srinivasa Mangapuram: కొత్తగా తిరుపతికొచ్చిన కుర్రోళ్ళని బతకనివ్వరా..?
ABN , Publish Date - May 12 , 2026 | 01:57 PM
మంగళవారం సినిమా హిట్ తరువాత అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వం వహిస్తోన్న చిత్రాల్లో శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram) ఒకటి. ఘట్టమనేని వారసుడు జయకృష్ణ (Jayakrishna) హీరోగా పరిచయమవుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ (Rasha Thadani) హీరోయిన్ గా నటిస్తోంది.
Srinivasa Mangapuram: మంగళవారం సినిమా హిట్ తరువాత అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వం వహిస్తోన్న చిత్రాల్లో శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram) ఒకటి. ఘట్టమనేని వారసుడు జయకృష్ణ (Jayakrishna) హీరోగా పరిచయమవుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ (Rasha Thadani) హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ సమర్పించడం మరింత బజ్ ని క్రియేట్ చేసింది.
తాజాగా శ్రీనివాస మంగాపురం నుంచి సెకండ్ సింగిల్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. మంగా మంగా అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. తిరుపతిలో జరిగే ప్రేమకథగా శ్రీనివాస మంగాపురం తెరకెక్కుతోంది. కొత్తగా తిరుపతికొచ్చిన కుర్రోళ్ళని బతకనివ్వరా..? అన్నదమ్ములు లేరా మీకు? అంటూ హీరో.. హీరోయిన్ అందాన్ని చూసి మైమరచిపోయి.. ఆమెపై ఉన్న ప్రేమ భావాలను తెలిపుతున్నట్లు లిరిక్స్ వింటుంటే అర్ధమవుతోంది.
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సాంగ్ కి కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించాడు. ఇక రేవంత్ తన వాయిస్ తో ఈ సాంగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. జయకృష్ణ క్యూట్ స్టెప్స్, మాస్ లుక్, రషా అందం, విజువల్స్ అదిరిపోయాయి. మే 13 న ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కి సిద్ధమవుతోంది. మరి మొదటి సినిమాతోనే ఘట్టమనేని వారసుడు హిట్ అందుకుంటాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.