సృష్టికైనా, వినాశనానికైనా పిలుపు రావాలి.. ‘సమవర్తి’ మేకింగ్ వీడియో వైరల్!
ABN, Publish Date - May 29 , 2026 | 01:04 AM
వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ.. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘సమవర్తి’ మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ.. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ (Satyadev). ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి రీసెంట్‌గా ‘సమవర్తి’ (Samavarthi) అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 16వ చిత్రమిది. సినిమాను రుద్ర పిక్చర్స్ బ్యానర్, పంచభూత ప్రొడక్షన్స్ పై శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్. వి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను త్వరలోనే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురాబోతున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి’ (Behind the Woods of Samavarthi) వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ వీడియోను గమనిస్తే.. విష సర్పాలు, క్రూర మృగాలు ఉన్న ప్రమాదకరమైన అడవుల్లో ‘సమవర్తి’ షూటింగ్ ఎంత సాహసోపేతంగా చేశారో.. ఈ గ్లింప్స్‌లో తెలియజేశారు. సౌతిండియాలోని 7 అరణ్య ప్రాంతాల్లో, ఇప్పటి వరకు ఎవరూ వెళ్లని 42 లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ చేయడం విశేషం. ‘సృష్టికైనా, వినాశనానికైనా ఒక పిలుపు రావాలి, ఒక పోరాటం పుట్టాలి, ఒక చిన్న యుద్ధం జరగాలి..’ అంటూ కథలోని సంఘర్షణను తెలియజేశారు. గ్లింప్స్ చివరలో ‘ఇక్కడ స్వర్గానికైనా చావే కావాలి తమ్ముడు..’ అనే హుక్ లైన్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ చిత్రంతో సత్యదేవ్ పూర్తిగా కొత్త జోన్‌లోకి అడుగుపెడుతూ, ఫుల్-ఫ్లెడ్జ్డ్ యాక్షన్ స్పేస్ వైపు గేర్ మార్చారు. ఈ సినిమాపై టీమ్ అంతా ఎంతో నమ్మకంగా ఉంది.
ఇవి కూడా చదవండి:
ఆడియో జ్యూక్ బాక్స్ విడుదల.. ‘పెద్ది’ టీమ్ తప్పు చేసిందా?
యూపీలో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?
‘అమ్మ’కు ఏమైంది? మరో సీనియర్ నటి సంచలన ఆరోపణలు!