Satyadev: ‘బాహుబలి, అవతార్’.. ‘రావు బహుదూర్’ రేంజ్ ఇది!

ABN , Publish Date - Apr 16 , 2026 | 06:10 PM

వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా, వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘రావు బహదూర్’. సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌‌లకు చెందిన జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తోన్న

Hero Satyadev

వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ (Satyadev) హీరోగా, వెంకటేష్ మహా (Maha Venkatesh) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘రావు బహదూర్’ (Rao Bahadur). సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌‌లకు చెందిన జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని.. ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, ప్రస్తుతం టీమ్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఫస్ట్ ‘ఓ సుందరి’ (O Sundari)ని తాజాగా హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ లాంఛ్ కార్యక్రమంలో సత్యదేవ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆయన ఈ సినిమాను ‘బాహుబలి, అవతార్’తో పోల్చడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.


ఈ కార్యక్రమంలో సత్యదేవ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలోని ‘ఓ సుందరి’ పాట వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నేను సినిమాలలోకి వచ్చిన కొత్తలో కమల్ హాసన్ చేసే తరహా పాత్రలు ఎప్పుడైనా వస్తాయా? అని అనుకునేవాడిని. ఒక రోజు దర్శకుడు వెంకటేష్ మహా ఈ కథ చెప్పారు. షూటింగ్ మొదటి రోజు ఉదయం మూడు గంటలకు సెట్‌లోకి వెళ్లి, రాత్రి రెండు గంటల వరకు షూటింగ్ చేశాను. ఇలా ఐదు రోజులు గడిచిన తర్వాత నాకు టెన్షన్ వచ్చేసింది. ‘ఇంకా ఎన్ని రోజులు ఇలా?’ అని అడిగాను. దాదాపు 85 రోజులు అని చెప్పారు. ఇక నా పని అయిపోయిందిలే అనుకున్నాను. అలాంటి సమయంలో ‘ఓ సుందరి’ పాట వినిపించారు. ఆ పాట మా టీమ్ అందరికీ ఓ డిటాక్స్‌లా అనిపించింది. ఈ పాట మహిళలను సెలబ్రేట్ చేసేలా ఉంటుంది. మా నిర్మాతలు ఇంత ఆనందంగా ఉన్నారంటే, దర్శకుడు మహా ఎంత అద్భుతంగా ఈ సినిమా తీశాడో అర్థం చేసుకోవచ్చు.


‘బాహుబలి, అవతార్’ వంటి సినిమాలు ఆ స్కేల్లో ఎలా అయితే ప్రేక్షకులని కూర్చోబెట్టగలిగాయో.. మా ఈ ‘రావు బహుదూర్’ సినిమా కూడా అంతే స్థాయిలో అలరిస్తుంది. ఇది నా ప్రామిస్. ఈ సినిమా ప్రేక్షకులందరినీ మెస్మరైజ్ చేస్తుంది. వెంకటేష్ మహా ఒకసారి మాటిస్తే తప్పే రకం కాదు. దేశం మొత్తం తిరిగి ఈ కథని రెడీ చేశాడు. ఈ సినిమా చూసి ప్రేక్షకులు అతన్ని సెలబ్రేట్ చేస్తారు. రామప్ప పాత్ర కోసం ప్రతిరోజూ ఐదు గంటల మేకప్ వేసుకోవాల్సి వచ్చేది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మహేష్ బాబుతో కలిసి నటించాను. కానీ సినిమాలో ఆ సీన్స్ కొన్ని కారణాల వలన ఉంచడం కుదరలేదు. ఇప్పుడు మహేష్ బాబు నా సినిమాను ప్రజెంట్ చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. విజయ్ ఈ పాట పాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ‘రావు బహదూర్’లాంటి సినిమా ఇచ్చిన దర్శకుడు మహాకు ధన్యవాదాలు’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

మంగ్లీకి మరో షాక్ ఇచ్చిన అడ్వొకేట్‌ సుబ్బారావు.. ఈ ట్విస్ట్ ఏంటయ్యో!

జూన్‌లోనే ‘పెద్ది’.. అధికారిక ప్రకటన వచ్చేసింది

Updated Date - Apr 16 , 2026 | 06:10 PM

SatyaDev: చిరంజీవి గారు చెప్పింది ఈ సినిమాతో నిజం అవుతుంది.. 

Satyadev Credits: నాకు గొప్ప పేరు తెచ్చిన చిత్రమిది

Satyadev: కచ్చితంగా హిట్ అనుకున్న ప్రతిసారి ఎదురుదెబ్బ తగిలేది

Satyadev: కింగ్‌డ‌మ్ నుంచి.. స‌త్య‌దేవ్ ఫ‌స్ట్‌ లుక్ వ‌చ్చేసింది

Mahesh Babu : దేశంలో అత్యుత్తమ నటుల్లో  ఆయనొకరు!