‘రంభ ఊర్వశీ మేనక’ కొత్త సాంగ్ వచ్చేసింది
ABN, Publish Date - Jul 22 , 2026 | 01:35 PM
అల్లరి నరేశ్, సురభి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రంభ ఊర్వశీ మేనక’ చిత్రంలోని లిరికల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు
అల్లరి నరేశ్, సురభి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రంభ ఊర్వశీ మేనక’ (Ramba Oorvasi Menaka). చంద్రమోహన్ చింతడ దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం ఈ సినిమాలోని ‘నా కంటి మీద కునుకే’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించిన ఈ పాటను ధనుంజయ్ ఆలపించారు. చైతన్ భరద్వాజ్ స్వరకర్త. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: IMAX: అమ్మబాబోయ్.. ఐమాక్స్ సినిమా అంటే ఇలా ఉంటుందా...
OG: బుల్లితెరపైకి పవర్ స్టార్ 'ఓజీ'..
Vijay: రావణుడిగా సీఎం విజయ్.. అమ్మవారిగా త్రిష..